Thursday, 15 October 2020

రేణు దేశాయ్ రీఎంట్రీ.. పాన్ ఇండియా మూవీలో పవర్‌ఫుల్ రోల్

చాలాకాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘ఆద్య’ పేరుతో తెరకెక్కబోయే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలో ఆమె ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. డీఎస్కే స్క్రీన్, సాయికృష్ణ పొడక్షన్ బ్యానర్లపై రావ్.డి.ఎస్, ఎస్.రజనీకాంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంతో ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. Also Read: ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్‌తో పాటు బాలీవుడ్‌ హీరో వైభవ్ తత్వవాడి కీలక పాత్రలో కనిపించనున్నారు. 'హుషారు' ఫేమ్ తేజ కురపాటి, గీతిక రతన్ యువ జంటగా కనిపించనున్నారు. విజయదశమి రోజున ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. చాలా ఏళ్ల తర్వాత రేణుదేశాయ్ నటించబోయే ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అదనపు హంగులు జోడిస్తున్నట్లు నిర్మాత ఎస్.రజనీకాంత్ తెలిపారు. చిత్ర వివరాలు: పీఆర్వో: ధీరజ అప్పాజీ ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరధి కథ-మాటలు: ఆదిత్య భార్గవ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్యరెడ్డి.ఎస్, ప్రొడ్యూసర్స్: రావ్ డి.ఎస్-రజనీకాంత్.ఎస్ కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఆర్.కృష్ణ మామిడాల Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lKSQOo

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....