Thursday, 15 October 2020

‘సోలో లైఫ్ ఇంకొద్ది రోజులే.. ఎంజాయ్ చేసేయ్’ .. మేనల్లుడికి మెగాస్టార్ బర్త్‌డే పంచ్

మేనల్లుడిగా తెరంగ్రేటం చేసిన సాయిధరమ్‌ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. మధ్యలో కొన్ని ప్లాపులు ఎదురైనా నిరాశ పడకుండా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. గతేడాది చివర్లో ‘ప్రతిరోజు పండగే’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తేజ్.. ‘ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బర్త్‌డే బాయ్‌కి మామ చిరంజీవి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలోని ‘అమృత’ పాటను సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసిన చిరు.. ‘హ్యాపీ బర్త్‌డే ప్రియమైన సాయితేజ్. ‘సోలో’గా ఉన్నప్పుడే ఫుల్‌గా ఎంజాయ్ చేయ్. నీ బ్యాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులే’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన సాయిధరమ్‌ తేజ్ మామకు ధన్యవాదాలు తెలిపారు. ‘ఇది ఉత్తమమైన బర్త్‌డే గిఫ్ట్. ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు మామ.. లవ్యూ సో మచ్. నీ అశీర్వాదాలు తప్ప ఇంకేమీ అడగను’ అని తేజ్ పేర్కొన్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటరు’ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహించారు. ‘ఇస్మార్ శంకర్’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుక నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lFE4IO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....