Sunday, 11 October 2020

కూతురు కన్నా గొప్ప బహుమతి ఏదీ ఉండదు: మహేష్ బాబు ఎమోషనల్ వర్డ్స్

కూతురు కన్నా గొప్ప బహుమతి ఇంకేమీ లేదు అని అంటున్నారు సూపర్ స్టార్ . ఈ సృష్టిలో ఆడ-మగ సమానమేనని చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆడపిల్లలు దృఢంగా ఉండాలని, తమ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలని సూచించారు. నేడు ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే (అంతర్జాతీయ ఆడపిల్ల దినోత్సవం) సందర్భంగా తన గారాపట్టి ఫొటోనూ షేర్ చేస్తూ ఈ పోస్ట్ చేశారు మహేష్ బాబు. ‘‘కూతురు కన్నా గొప్ప బహుమతి ఇంకేమీ లేదు! తన చిన్ని ప్రపంచాన్ని స్వయంగా నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోన్న నా చిన్నారిని చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను. మీ కలలను నిర్లక్ష్యం చేయొద్దు, మీ గొంతును వినిపించడండి. దృఢంగా ఉండండి. మీకు ఏది సరైనదో దాని గురించి పోరాడండి. సమానత్వంతో కూడిన ప్రపంచాన్ని మనం ఏర్పరుచుదాం. నా చిన్నారి పాపతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న బాలికలంతా సెలబ్రేట్ చేసుకుంటోన్న రోజు ఇది.. ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే’’ అని మహేష్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. పరుశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lE3lTN

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....