Wednesday 17 June 2020

Vakeel Saab: వకీల్ సాబ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన శృతి హాసన్!! కారణమిదే..

'' సినిమాతో మరోసారి వెండితెర సందడి చేయనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ 'పింక్' రీమేక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రంలో పవన్ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందట. అందుకోసం ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్‌ని సంప్రదించారట దర్శకనిర్మాతలు. కానీ ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. రీ ఎంట్రీలో నిడివి తక్కువ ఉండే పాత్రలు, సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తే కెరీర్ గాడి తప్పే ప్రమాదం ఉందని ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. Also Read: నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్ అలాగే హీరో పవన్ కళ్యాణ్ లతో గతంలో సినిమాలు చేసిన అనుభవం ఉన్నప్పటికీ, పాత్ర నిడివి తక్కువగా ఉందనే కోణంలోనే వాళ్ళ ఆఫర్ కాదనుకుందట శృతి హాసన్. తాజాగా బయటకొచ్చిన ఈ వార్తతో వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ నటించనుందనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది. ఇకపోతే రీ ఎంట్రీ ఆరంభంలోనే రవితేజతో రొమాన్స్ చేసింది శృతి హాసన్. క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'క్రాక్' సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైన క్రమంలో లాక్‌డౌన్ రావడంతో వాయిదా పడింది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. సినీ కెరీర్‌పై శ్రద్ద పెట్టిన శృతి మరో ఇద్దరు బడా దర్శకుల కథలు విన్నట్లు టాక్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Bk7TfU

No comments:

Post a Comment

'Rekha And I Didn't Speak To Each Other For 20 Years'

'Rekha and my wife were close friends, and my so-called cold war with Rekha was causing difficulties in my wife's friendship with he...