Sunday, 28 June 2020

‘మనం సైతం’ కార్యాలయంలో మొక్కలు నాటిన వి.వి.వినాయక్, పూనమ్ కౌర్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు టాలీవుడ్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా, టీవీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు చాలా మంది మొక్కలు నాటారు. తాజాగా ఈ జాబితాలో దర్శకుడు , నటి చేరారు. హైదరాబాద్‌లోని ‘మనం సైతం’ కార్యాలయం ఆవరణలో నటుడు కాదంబరి కిరణ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. భావి తరాలకు మనం ఇచ్చే విలువైన బహుమతి లాంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. Also Read: పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది మానవతావాదులు ఎంతో సహాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో ఎంత మంది మంచి మనుషులు ఉన్నారనే విషయం కూడా తెలుస్తుంది. సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. కొవిడ్-19 తరవాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. చాలా రోజుల తరవాత ఇంత మంది జనాలను చూస్తున్నాను. భయపడుతున్నా కానీ చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘మనం సైతం’ సాయం నటుడు కాదంబరి కిరణ్ సారథ్యంలోని ‘మనం సైతం’ ట్రస్ట్ కరోనా కాలంలో ఇప్పటికే ఎంతో మందికి ఉచితంగా వంట సరుకులు అందించింది. తాజాగా 230 మందికి నగదు సహాయం చేసింది. ఇందుకు వసుధ ఫౌండేషన్ బాసటగా నిలిచింది. సినిమా రంగ కార్మికులతోపాటు అనేక మంది నిరుపేదలు ఈ నగదు సహాయం అందుకున్నారు. దర్శకుడు వి.వి.వినాయక్, హీరోయిన్ పూనమ్ కౌర్ చేతుల మీదుగా ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు మాట్లాడుతూ.. ‘కాదంబరి చేస్తున్న నిస్వార్థ సేవను తమ వంతుగా మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘మనం సైతం’కు వసుధ ఫౌండేషన్ చేయూత అందిస్తోంది’ అని అన్నారు. నగదు సహాయం అందించడం చాలా గొప్ప విషయమని వి.వి.వినాయక్ ప్రశంసించారు. ‘నగదు సహాయం అందుకున్న వాళ్ళు అశీర్వదించండి.. అందని వాళ్ళు అందాక ఆగండి. తదుపరి విడతలో తప్పక అందిస్తాం’ అని కాదంబరి అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31plQV6

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk