Friday, 26 June 2020

నగ్నం: సరస శృంగార భరితం.. మరో వీడియోతో పరేషాన్ చేసిన వర్మ.. డైరెక్టుగా గురి పెట్టేశాడు!

వివాదాస్పద దర్శకుడిగా ఫేమ్ అయిన .. అనుక్షణం సంచలనం అనే ఫార్ములానే ఫాలో అవుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ని క్యాచ్ చేస్తూ ఆడియన్స్ నోళ్ళలో నానిపోతున్నారు. మొదట విలక్షణ దర్శకుడిగా 'శివ, క్షణక్షణం' లాంటి సరికొత్త కథాంశాలను తెలుగు ప్రేక్షకుల ముందుంచిన ఆయన.. ఆ తర్వాత కొంతకాలానికి హారర్ సినిమాలు చేశారు. రీసెంట్‌గా రాజకీయ నేపథ్యంలోనూ సినిమాలు రూపొందించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు. ఇక ఇప్పుడు అడల్ట్ మూవీస్‌పై కన్నేసి టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు వర్మ. ఈ నేపథ్యంలో ఇటీవలే 'క్లైమాక్స్' అంటూ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో యువతను ఆకర్షించిన రామ్ గోపాల్ వర్మ.. గత 10 రోజులుగా '' మూవీ అప్‌డేట్స్ ఇస్తూ ఫుల్లుగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రమోషన్స్ విషయంలో తనకంటూ ఓ స్పెషాలిటీ ఉంటుందని నిరూపిస్తూ ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు ట్రైలర్స్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సాంగ్ రిలీజ్ చేసి యువతకు గురి పెట్టేస్తూ తన 'నగ్నం' మూవీపై ఆసక్తి రేకెత్తించారు. Also Read: తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో సన్నివేశాలు చూస్తుంటే.. అబ్బో! కెమెరాను ఇలా కూడా వాడుకోవచ్చా? అడల్ట్ మూవీని ఈ రకంగా కూడా రూపొందించవచ్చా? అనే సందేహం కలుగుతోంది. పైగా బోల్డ్ సన్నివేశాలు వస్తుండగా ''సరస శృంగార భరితం'' ఈ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వాయిస్ ప్లే అవుతుండటం సరస ప్రియులను మరింత ఆకర్షిస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో 'నగ్నం' () మూవీ రూపొందిస్తున్నారు వర్మ. ఈ చిత్రాన్ని జూన్ 27 రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. ఇది చూడాలంటే 200 రూపాయలు చెల్లించాలని ఆయన డిసైడ్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31lrV4F

No comments:

Post a Comment

'Partition Should Never Have Happened'

'We wouldn't have had to face all this had our national leaders taken care to select a place for Sindhis and sent us there, instead ...