Monday, 29 June 2020

NAKED Movie: షాకింగ్.. ‘వర్మ’ నగ్నం బడ్జెట్ లక్ష కాదు.. జస్ట్ 2 వేలు, 12 గంటల్లో 70 లక్షల రెవెన్యూ, లెక్కలివిగో

నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది ‘నగ్న’ సత్యం అంటున్నారు ‘నగ్నం’ దర్శకుడు . వెస్ట్ గోదావరి స్వీటీ పాపతో నగ్నం-నేకెడ్ అనే లషు చిత్రాన్ని రూపొందించి జూన్ 27 రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేశారు ఆర్జీవీ. అంతకు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే మరో బూతు చిత్రాన్ని తీసి ఆన్ లైన్‌లో కాసులు కురిపించుకున్న వర్మ.. ఈ యాపారం ఏదో బాగుందని ఎలాగూ సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి దేవరపల్లి (వెస్ట్ గోదావరి) పెద పాపతో ‘NAKED (నగ్నం) అనే చిత్రాన్ని వదిలిపెట్టారు. స్వీటీ నగ్న చిత్రం చూడాలంటే.. రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని రేటు ఫిక్స్ చేశారు వర్మ. అసలే లాక్ డౌన్ కరువులో ఉన్నారో ఏమో కాని.. స్వీటీ పాప ‘నగ్నం’ చూసేందుకు పోటీ పడ్డారు నెటిజన్లు. ఏకంగా తొలి అరగంటలోనే 23,560 టిక్కెట్లు అమ్ముడు కాగా.. ఈ లఘు చిత్రం మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ తీసుకొచ్చింది. ఇక తొలి 20 గంటల్లో ఏకంగా 35445 పెయిడ్ వ్యూస్ వచ్చాయి. సోమవారం నాటికి కోటిని క్రాస్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ‘నగ్నం’. అయితే సినిమా ఎగబడి చూసిన వాళ్లు ఇందులో ఏం లేదని తేల్చేసినా.. వర్మ కాన్సెప్ట్ అది కాదు కదా. సినిమాపై క్లిక్ చేసేలా చేయడమో కావడంతో వర్మ ‘నగ్నం’తో సూపర్బ్ సక్సెస్ అయ్యాడు. ఒకవైపు బడా నిర్మాతలు పెద్ద పెద్ద సినిమాలు తీసి ఎలా విడుదల చేయాలా అని తలల పట్టుకుంటుంటే.. లక్ష రెండు లక్షలతో సినిమాలు ఆర్జీవీ కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంతకీ వర్మ ఈ సినిమాను ఎంత బడ్డెట్‌తో తీశాడు అంటే.. కొంత మంది ఐదు లక్షలు అని.. ఇంకొంత మంది లక్ష అంటూ లెక్కలు చెప్పారు. మూవీ క్రిటిక్ మహేష్ కత్తి అయితే ఓ అడుగు ముందుకు వేసి.. ‘‘అంటే మీరు ఒప్పుకోరుగానీ... వర్మ "నగ్నం" రాజమౌళి 'బాహుబలి' రికార్డుల్ని బద్దలుకొట్టింది. లక్ష రూపాయల ఖర్చుతో తీసిన ఈ లఘు చిత్రం మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పండ్రా...వాట్ టు డూ వాట్ నాట్ టు డూ!?!’’ అంటూ వర్మ నగ్నం కలెక్షన్లపై పోస్ట్ పెట్టాడు. కత్తికి క్లోజ్ ఫ్రెండ్‌ అయినా వర్మ.. కలెక్షన్లు ఓకే కాని.. ఖర్చు లక్ష అని రాశావ్ ఏంటి మిత్రమా? అంటూ అర్థరాత్రి పూట కత్తి మహేష్‌కి ఫోన్ చేసి అసలు బడ్జెట్‌ను రివీల్ చేయడంతో కత్తికి కళ్లు బైర్లు కమ్మాయట. ఈ విషయన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ‘నగ్నం’ చిత్రానికి అయిన బడ్జెట్ కేవలం రూ.2 వేలు మాత్రమే అని స్వయంగా వర్మ చెప్పాడంటూ బాంబ్ పేల్చేడు కత్తి మహేష్. ‘వర్మ గారికి కోపమొచ్చింది. అర్ధరాత్రి అంకమ్మ చివాలన్నట్లు ఇందాకే వర్మ ఫోన్. ఏంటయ్యా నా "నేకెడ్" ఫిల్మ్ బడ్జెట్ ఒక లక్ష అనిరాశావ్? అన్నారు. ఏమోనండి అంతకు మించిన ఖర్చు అందులో ఏమీ కనిపించలేదు. అందుకే లక్ష అని డిసైడ్ అయ్యాను, అని క్లియర్ గా చెప్పేసా. అందుకు ఆయన నవ్వుతూ... నన్ను అడిగితే నేను అసలు ఖర్చు చెప్పేవాడినిగా అన్నారు. గురుడు ఎన్నో పెగ్గులో ఉన్నాడో ఏమో అనుకుంటూ. చెప్పండి అన్నా.. జస్ట్ రెండు వేలు... అక్షరాలా INR 2000 అని బాంబ్ పేల్చాడు. అదేం లెక్కండి అని నేను అడిగేలోపే, లెక్క తేల్చేశాడు. ఆ నౌఖరు పాత్ర చేసిన కుర్రాడి ట్రావెల్ ఖర్చు రెండు వేలు తప్ప ప్రొడక్షన్ ఖర్చు ఏం లేదు. కెమెరా, ఎడిటింగ్ మిక్సింగ్ అన్ని మా దగ్గరే జరిగాయి. ఏ ఖర్చూ లేకుండా అని నిజం చెప్పారు. ఏమిటి ఈయన? ’అంటూ ‘నేకెడ్-నగ్నం’ బడ్జెట్-కలెక్షన్స్ వివరాలను తెలియజేశాడు వర్మ వీరాభిమాని కత్తి మహేష్. అసలే వర్మ.. ఆపై అర్థరాత్రి ఫోన్.. అదీ కత్తి మహేష్‌కి... ఆ రాత్రిలో ‘నగ్నం’ చిత్రంపై డిస్కషన్.. బడ్జెట్ రూ.2 వేలు అని చెప్పడం.. ఇదేదో నమ్మబుల్‌గా లేదు కాని. సినిమాని చూసిన చాలా మంది అయితే హా.. ఈ సినిమాకి అంతకంటే ఖర్చు ఎక్కువ కాదులే అంటూ కత్తి కామెంట్స్‌పై స్పందిస్తున్నారు. మరీ రెండు వేలేనా?? నటించిన వాళ్లకి కనీసం భోజనం కూడా పెట్టలేదా? అని నెటిజన్లు డౌట్స్ రైజ్ చేస్తుంటే.. ‘ఫిల్మ్ ప్రొడక్షన్ లెక్కలోకి వచ్చే ఖర్చు వేరు. కాస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వేరు. ఆల్రెడీ జీతాలు ఇస్తున్నవాళ్ళతో పని చేయించుకుని ఓవర్ హెడ్స్‌లో కలపొచ్చు. కానీ వర్మ అలా చెయ్యలేదు’ అంటూ క్లారిటీ ఇస్తున్నాడు కత్తి. ఇదీ పాయింటే కదా.!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dFr1mc

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk