వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటి ఫైర్ అయ్యారు. తాను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆర్జీవీ అంటే గౌరవం ఉండేదని, ఇప్పుడు ఆయనను చూసి తనకు బాధ కలుగుతోందని అన్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ సినిమాను ప్రకటించడమే. ప్రస్తుత కరోనా సమయంలో ఆన్‌లైన్ ద్వారా వరుసపెట్టి సినిమాలను వదులుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ పేరిట ప్రేక్షకుల ఇంటి వద్దకే సినిమాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతున్నారు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ అనే రెండు సినిమాలను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ‘పవర్ స్టార్’ టైటిల్‌తో సినిమాను రూపొందిస్తు్న్నారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ ద్వారా వర్మ ప్రకటించారు. అంతేకాదు, ‘పవర్ స్టార్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చేయబోయే నటుడిని కూడా పరిచయం చేశారు. Also Read: ‘‘బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నా తరవాత సినిమా టైటిల్ ‘పవర్ స్టార్’. పీకే, ఎంఎస్, ఎన్‌బీ, టీఎస్, ఒక రష్యా మహిళ, నలుగురు పిల్లలు, 8 బర్రెలు, ఆర్జీవీ పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలు ఏమిటో అర్థం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు ఉండవు’’ అని వర్మ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌కు పూనమ్ కౌర్ కౌంటర్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనతో ఆర్జీవీ ప్రవర్తించిన తీరును బయటపెట్టారు. ‘‘అమ్మాయిల మానసిక బలహీనతను పసిగట్టడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించమని వారిని ప్రేరేపించడం, తన ట్వీట్స్‌ను పంపి షేర్ చేయమని చెప్పడం, దీని గురించి మీడియాకు తెలియజేయడం వంటి పనులు చేసే ఆర్జీవీ అనే క్యారెక్టర్‌ను కూడా దయచేసి ఈ సినిమాలో పెట్టండి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మీరంటే నాకు ఎంతో గౌరవం. కానీ, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది’’ అని పూనమ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, రామ్ గోపాల్ వర్మతో తన అనుభవాన్ని కూడా మరో ట్వీట్‌లో పొందుపరిచారు. ‘‘ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక గంటపాటు నాకు బ్రెయిన్‌వాష్ చేసిన ఈ విశ్వాసఘాతుకుడైన డైరెక్టర్ ఫోన్ కాల్‌ను రికార్డు చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అతను నాకు పంపిన ట్వీట్స్‌ను సంబంధిత వ్యక్తికి నేను అప్పుడే పంపాను. నా అదృష్టం కొద్దీ మీడియాలో కొంత మంది నిజాయతీపరులు ఉన్నారు. లేకపోతే నీ కుట్రలకు నేను బలైపోయేదాన్ని’’ అని వర్మను ఉద్దేశించి పూనమ్ ఆరోపణలు చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BLT4TI
No comments:
Post a Comment