Saturday 27 June 2020

దాసరి కొడుకులు వెధవల్లా కొట్టుకుంటున్నారేంటి అంటారు..: ప్రెస్ మీట్‌లో అరుణ్ కుమార్

లెజండరీ దర్శకుడు కుటుంబంలో ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నారు. వారి ఇద్దరు కుమారులు ప్రభు-అరుణ్ కుమార్‌లు ఆస్తికోసం రచ్చ కెక్కకెక్కారు. ఇప్పటికే వీరి ఆస్తివ్యవహారం కోర్టులో ఉండగా.. బుధవారం రాత్రి దాసరి చిన్న కుమారుడు ప్రభు ఇంట్లోకి గేటు దూకి మరీ రావడంతో పోలీసుల్ని ఆశ్రయించారు పెద్ద కొడుకు ప్రభు. అయితే ఈ వ్యవహారంలో అరుణ్ కుమార్‌పై పలు ఆరోపణలు చేయగా.. వాటిపై క్లారిటీ ఇస్తూ శనివారం నాడు ప్రెస్ మీట్ పెట్టారు అరుణ్ కుమార్. ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎన్నో సమస్యల్ని పరిష్కరించిన నా తండ్రి ఇంట్లోనే సమస్య రావడం చాలా బాధగా ఉంది. ఆయన ఎందరికో అండగా నిలిచారు.. మేం తిట్టుకుని కొట్టుకుంటే చూసే వాళ్లకు వెదవల్లా కనిపిస్తున్నాము. వీళ్లేంటి వెధవల్లా ఆస్తికోసం రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు అనుకుంటారు జనం. ఇలాంటిది అవసరమా?? నాకు మా సిస్టర్, బ్రదర్‌తో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్లకు ప్రాబ్లమ్ ఉంటే వచ్చి మాట్లాడి సమస్యను పరిష్కరించుకోమనండి. మా అన్నయ్యకు ఏవైనా సమస్యలు ఉంటే నాతో మాట్లాడాలి. అంతే తప్ప ఇండస్ట్రీ పెద్దలు సహకరించడం లేదని వాళ్లను బయటకు లాగడం కరెక్ట్ కాదు. నేను ఎవరి ప్రాపర్టీలోకి దూకలేదు.. నా ప్రాపర్టీలోకి నేను వెళ్లా. నా ఆధార్‌‌తో పాటు పాన్‌ కార్డ్‌ మిగతా అన్ని అడ్రస్‌లు ఆ ఇంటివే ఉంటాయి. అడ్రస్ ఉన్నంత మాత్రాన ఆ ఇళ్లు నా ఒక్కడిదే అని చెప్పడం లేదు.. నాది, మా బ్రదర్, సిస్టర్‌ది. మొన్న రాత్రి ఆ ఇంటికి వెళ్లింది నేనే.. ఎందుకంటే నాకు ఒక కొరియర్ వచ్చింది. సాయత్రం 6.30 రావడంతో అది తీసుకోవడానికి వెళ్లాను. కొరియర్ బాయ్ ఫోన్ చేసి మీ డాక్యుమెంట్స్ కొరియర్ ఇంటి దగ్గర ఇచ్చాం అన్నారు. నేను దాన్ని తీసుకోవడానికి రాత్రి 9.30కి వెళ్లా. ఇంచుమించు అరగంట బెల్ కొట్టా.. వాళ్లు డోర్ తీయలేదు. అందుకే గేట్ దూకి వెళ్లాను. నేను గేట్ దూకి వెళ్లడం కొత్తేం కాదు. గురువు గారు (దాసరి) ఉన్నప్పుడు కూడా గేట్ దూచి వెళ్లేవాడిని. అలాగే ఇప్పుడూ వెళ్లా. హాల్‌లో ఎవరూ లేకపోవడంతో మా నాన్న గారి రూంలోకి వెళ్లా. ఆ తరువాత మా అన్నయ్య రావడంతో నా డాక్యుమెంట్స్ కొరియర్ వచ్చింది ఇవ్వమని అడిగా.. లేదు అని హడావిడిగా కిందికి వెళ్లాడు. ఓ పది నిమిషాల తరువాత జూబ్లీహిల్స్ ఎస్ ఐ నవీన్ ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. ఆయనే నా కొరియర్ డాక్యుమెంట్స్ ఇప్పించారు. వాటిని తీసుకుని వెళ్లిపోయా. నేను తాగి వెళ్లి హడావిడి చేశా అనడంలో నిజం లేదు. ఎందుకంటే తాగి వెళ్లితే ఆ గేటు ఎక్కి అక్కడే పడిపోయేవాడిని. పైగా ఎస్ ఐ గారు కూడా స్పాట్‌లోకి వచ్చి నన్ను చూశారు. మా అన్నయ్య ఇలాంటి ఆరోపణలు చేశారో నాకు తెలియదు. ఇందులో రహస్యం ఏం లేదు.. ఇద్దరికీ ఆస్తి గొడవలు తప్ప ఎలాంటి వేరే గొడవలు లేవు. నాకు మా సిస్టర్, బ్రదర్‌తో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్లకు ప్రాబ్లమ్ ఉంటే వచ్చి మాట్లాడమనండి. వాళ్లకు ఖచ్చితంగా సహకరిస్తా. అంతేతప్ప మీడియా, పోలీస్ స్టేషన్‌లకు వెళ్లడం వల్ల ఉపయోగం ఉండదు. మేలో నాపై మా అన్నయ్య పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. మా బ్రదర్ నాకు అన్యాయం చేశాడని ఫిర్యాదు చేశాడు. అన్యాయం చేశారని అంటున్నారు.. న్యాయం చేయాలంటే ఏం అన్యాయం చేశానో చెప్పాలి కదా.. అలాందిటి ఏమైనా ఉంటే నిరూపించాలి. నాతో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం అవుతుంది. మోహన్ బాబు, సీ కళ్యాణ్, మురళీమోహన్ గారు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు.. వాళ్లు ఏం చేశారు. ముందు నాతో మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ ఇళ్లు ముగ్గురిదీ.. కోర్టు కూడా అదే చెప్పింది’ అంటూ క్లారిటీ ఇచ్చారు .


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NyImCD

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc