Sunday, 28 June 2020

‘శివన్’ ట్రైలర్: ఇది ప్రపంచంలోనే తొలి ఏటీటీ ఫిలిం

ప్రపంచీకరణ ప్రభావం ఎంటర్‌టైన్మెంట్ మీద కూడా పడింది. డిజిటలైజేషన్ కారణంగా ఎంటర్‌టైన్మెంట్ ప్రజలకు మరింత చేరువైంది. ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫాంలలో వివిధ భాషలకు చెందిన బోలెడంత కంటెంట్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. అందుకే, కరోనా కాలంలో థియేటర్లు మూతబడినా ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా ప్రజలు ఎంటర్‌టైన్మెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కొత్త కొత్త సినిమాలను వీక్షిస్తున్నారు. వెబ్ ఫిలింస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వెబ్ సిరీస్‌లు చూస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు చిత్రీకరణ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలనే చాలా మంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే, నిన్న మొన్నటి వరకు ఓటీటీనే చాలా మందికి కొత్త. కానీ, ఇప్పుడు ఏటీటీ ప్లాట్‌ఫాం వచ్చింది. అంటే ఎనీటైమ్ థియేటర్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రేయాస్ మీడియా ఈ ఏటీటీ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టింది. శ్రేయాస్ ఈటీ పేరుతో డిజిటల్ వరల్డ్‌ను సృష్టించింది. Also Read: అయితే, ఓటీటీ-ఏటీటీ వీటి మధ్య తేడా ఏంటి అనే అనుమానం చాలా మందిలో ఉండొచ్చు. ఓటీటీ ప్లాట్‌ఫాంలను మనం నెలకు లేదంటే ఏడాదికి సబ్‌స్క్రిప్షన్ తీసుకొని దానిలో ఉన్న కంటెంట్‌ను ఎంజాయ్ చేస్తాం. ఏటీటీ అలా కాదు. ఏదైనా సినిమా లేదంటే సిరీస్‌ను ఒకసారి చూడటానికి డబ్బులు చెల్లిస్తాం. ఉదాహరణకు ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ సినిమాలకు చెల్లించినట్టు. ఈ రెండు సినిమాలు శ్రేయాస్ ఈటీ ఏటీటీ ప్లాట్‌ఫాంలోనే అందుబాటులో ఉన్నాయి. ‘క్లైమాక్స్’ చూడాలంటే రూ.100, ‘నగ్నం’ చూడాలంటే రూ.200 చెల్లించాలి. ఈ ప్లాట్‌ఫాం సినీ నిర్మాతలకు ఎంతో ఉపకరిస్తుందని చాలా మంది అభిప్రాయం. కాగా, రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసిన రెండు చిన్న సినిమాలను మాత్రమే ఇప్పటి వరకు శ్రేయాస్ ఈటీలో విడుదల చేశారు. ఇప్పుడు థియేటర్‌లో విడుదలైన సినిమాలను కూడా ఈ ప్లాట్‌ఫాంలోకి తీసుకొస్తున్నారు. ఈ విధంగా ప్రపంచంలోనే ఏటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైన తొలి సినిమాగా ‘శివన్’ నిలవనుంది. సాయితేజ, తరుణి సింగ్ హీరోహీరోయిన్లుగా శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 13న విడుదలైంది. అయితే, సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ‘శివన్’ గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. Also Read: అయితే, ఈ సినిమాను ఇప్పుడు శ్రేయాస్ ఈటీలో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ‘శివన్ ట్రైలర్’ను విడుదల చేశారు. దీంతో ‘302’ మూవీని కూడా శ్రేయాస్ ఈటీలో విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాస్త అడల్ట్ కంటెంట్‌తో కూడిన థ్రిల్లర్ మూవీస్. భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘302’లో వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా మార్చి 13న విడుదలైంది. మొత్తం మీద శ్రేయాస్ ఈటీ మరో కొత్త ప్లాట్‌ఫాంకు తెరతీసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dGV8K2

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk