Sunday 28 June 2020

హెబ్బా పటేల్‌తో ‘సరిగమ’ పాడుతోన్న రాజ్ తరుణ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి ‘స‌రిగ‌మ‌ప’ లిరికిల్ సాంగ్‌ను తాజాగా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ‘స‌రిగ‌మ‌గ‌మ‌ గామ హంగామ చేద్దామా.. ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా నీద‌మ్మా’ అంటూ హుషారుగా సాగే ఈ పాట‌లో రాజ్‌ తరుణ్ ఎన‌ర్జిటిక్ స్టెప్పులు, హెబా ప‌టేల్ అందాలు యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట‌కు వ‌న‌మాలి సాహిత్యం అందించ‌గా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్‌ రూబెన్స్ ఆలపించారు. ‘కుమారి 21ఎఫ్’, ‘అంధగాడు’, ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజ్‌ తరుణ్, హెబా ప‌టేల్ క‌లిసి న‌టిస్తోన్న మ‌రో చిత్రం ఇది. Also Read: కాగా, ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నంద్యాల రవి మాటలు రాశారు. ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. రియల్ సతీష్ ఫైట్స్ డిజైన్ చేశారు. ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది. లాక్‌డౌన్ కారణంగా ఆగింది. థియేటర్లు తెరుచుకున్న తరవాత విడుదల తేదీని ప్రకటిస్తారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eFTABr

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz