Monday, 29 June 2020

Rgv: అల్లు అర్జున్, రానా పేర్లు తీస్తూ రామ్ గోపాల్ వర్మ కామెంట్స్.. ఆ ఇద్దరి కారణంగా!!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనే అంశంపై పలు చర్చలు నడుస్తున్నాయి. నటీనటులు, ప్రేక్షకులు అంతా ఈ బంధుప్రీతి గురించే మాట్లాడుకునే పరిస్థితులు వచ్చేశాయి. సినీ వారసులకే అవకాశాలు, స్టార్ స్టేటస్ తప్ప టాలెంటెడ్ యాక్టర్స్ ఎవ్వరికీ కనిపించరనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ప్రముఖుల వస్తున్న విమర్శలు, ఇండస్ట్రీలో నెపోటిజం లాంటి అంశాలపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ద్వారానే స్టార్ స్టేటస్ కొట్టేయడం ఎవరి తరం కాదని అన్నారు. రియల్ నెపోటిజం అంటే స్టార్ హీరోల కుమారులందరూ స్టార్ హీరోలు కావాలి.. కానీ అలా జరగడం లేదే అంటూ ఆసక్తికరంగా స్పందించారు వర్మ. హిందీలో ఫిరోజ్ ఖాన్, అమితాబ్ లాంటి హీరోలు తమ కుమారులను స్టార్ హీరోలుగా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. Also Read: ఈ సందర్భంగా.. గతంలో జరిగిన ఓ విషయాన్ని వర్మ ప్రస్తావించారు. కొన్నేళ్ల క్రితం తనను ఓ తమిళ నటుడు కలిశాడని... , కోసం అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు తన కెరీర్ నాశనం చేశారని చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ, రానాను ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు నన్ను తొక్కేస్తున్నారని, తెలుగులో మా లాంటి వాళ్లకు థియేటర్లు ఇవ్వడం లేదని ఆ హీరో చెప్పినట్లు వర్మ పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు చేయడం పనికిరాని వాళ్ళ పని అంటూ వర్మ చెప్పడం హాట్ ఇష్యూ అయింది. థియేటర్లో ఎవరి మూవీ చూడాలనేది పూర్తిగా ప్రేక్షకుడి ఛాయిస్ మాత్రమే. ప్రేక్షకుడి ఆధరణే ఉంటేనే ఆ సినిమా ఆడటం, హీరోకి స్టార్ స్టేటస్ తీసుకురావడం జరుగుతుంది. అంతేగానీ ఓ స్టార్ హీరోనో, నిర్మాతనో తలచుకొంటే తమ కొడుకులను స్టార్ హీరోలు చేయడమనేది జరిగే పని కాదని వర్మ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38oq8h3

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...