Monday, 29 June 2020

Ram Gopal Varma: 'పవర్ స్టార్' ఎవరో తెలిసిపోయింది.. ఇవిగో పూర్తి వివరాలు!! వాళ్ళిద్దరి మధ్య డీల్..

సమయం, సందర్భం ఏదైనా సరే.. రామ్ గోపాల్ వర్మకు తెలిసిన ఒకే ఒక మంత్రం సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వార్తల్లో నిలవడం. ఆయన మాట, దూసుకుపోయే విధానం, తీసే సినిమాలు దేనికవి ప్రత్యేకమే. అది సినిమా అయినా, ఇంటర్వ్యూ అయినా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టేయడం వర్మ నైజం. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా మోల్డ్ అవుతూ సినిమాలు రూపొందించడం ఆయన లోని స్పెషల్ క్వాలిటీ. ఈ క్రమంలోనే డిజిటల్ టెక్నాలజీకి, ఆన్‌లైన్ వేదికలకు డిమాండ్ పెరుగుతుండటం క్యాచ్ చేసుకుంటూ RGVWorld.in/ShreyasET ద్వారా వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నారు వర్మ. ఇప్పటికే ''క్లైమాక్స్, నగ్నం'' సినిమాలతో సంచలనం సృష్టించిన ఆయన గత రెండు రోజుల క్రితం లైఫ్ ఆధారంగా 'పవర్ స్టార్' సినిమా తీస్తున్నట్లు ప్రకటించి మరో ఆటం బాంబ్ వేశారు. అంతేకాదు ఇందులో నటించబోయే నటుడు, ఇతనే అంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. Also Read: వర్మ విడుదల చేసిన ఆ వీడియోలోని నటుడు అచ్చం పవన్ కళ్యాణ్‌ని పోలి ఉండటంతో.. అతను ఎవరు? ఆ నటుణ్ని వర్మ ఎలా పట్టాడు? అనే అన్వేషణ మొదలైంది. ఈ నేపథ్యంలో ‘తెలుగు సమయం’కు ప్రత్యేకంగా ఈ నటుడికి సంబంధించిన కొన్ని వివరాలు తెలిశాయి. అతని పేరు నరేష్. భద్రాచలంకు సమీపంలోని సారపాక గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్‌ని‌ పోలిన రూపు రేఖలు కలిగి ఉండటంతో ఆయనను అనుకరిస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తుంటాడు. ఈ వీడియోలు చూసి ఇతన్ని వర్మ కాంటాక్ట్ అయ్యారట. ఆ నటుడి వివరాలు సేకరించి ప్రత్యేకంగా కారు పంపించి తన ఆఫీసుకు రప్పించారట. 'పవర్ స్టార్' సినిమాలో నటించాలని ఆయన్ను కోరిన వర్మ.. కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తా అని మాటిచ్చారట. రెండు భాగాలుగా ఈ మూవీ ఉంటుందని వర్మ చెప్పారట. అయితే ఇందుకు సంబంధించి డీల్ ఇంకా సెట్ కాలేదని, ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య చర్చలు మాత్రమే నడుస్తున్నాయని తెలిస్తుండటం గమనార్హం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dRlp8I

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....