Thursday, 25 June 2020

డైరెక్టర్ వచ్చి ఆ మాట అడిగాడు.. రెడీ అన్నాను కానీ అదంతా నా అసిస్టెంట్ రికార్డ్ చేశాడు: శ్రద్ద శ్రీనాథ్

తెలుగులో ఇటీవలే నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' సినిమాతో అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ భామ . మొదటి సినిమాతోనే మంచి బ్రేక్ తెచ్చుకున్న ఈ బ్యూటీ సెట్స్ మీద గానీ, నిజ జీవితంలో గానీ చాలా డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటుంది. దీంతో వరుస సౌత్‌లో అవకాశాలు పట్టేసిన ఈమె ‘’లో నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా సమర్పణలో రవికాంత్ పేరూరు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గురువారం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసింది శ్రద్ద శ్రీనాథ్. జూన్ 2017లో హైదరాబాద్ లోని నంది హిల్స్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను బుల్లెట్ నడుపుతూ క్రింద పడిన విషయాన్ని చెబుతూ ఆ సమయంలో డైరెక్టర్‌కి, తనకు మధ్య జరిగిన సంభాషణను వివరించింది. Also Read: ''క్రిష్ణ అండ్‌ హిజ్‌ లీల షూటింగ్‌లో భాగంగా నేను బైక్ నడిపే సన్నివేశం ఉంది. అందుకోసం డైరక్టర్ రవికాంత్.. నా దగ్గరికి వచ్చి బైక్ నడపగలవా? అన్నారు. రాజీపడటం ఇష్టంలేక దానికి నేను.. రాదు కానీ ట్రై చేస్తా అని చెప్పి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఎక్కేశా. ఇందుకు కారణం నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు బైక్ నడిపిన అనుభవం ఉండటమే. అయితే ఆ రోజు ఆ ప్రాంతమంతా తడిగా ఉంది. దీంతో అలా బైక్ ఎక్కి టర్న్ చేశానో లేదో.. బ్యాలన్స్ తప్పి క్రింద పడిపోయా. ఆ ఘటనను మొత్తం నా అసిస్టెంట్ ప్రశాంత్ సరదాగా వీడియో తీశాడు. అలా నేను క్రిందపడగానే సెట్ లో ఉన్నవాళ్లంతా సెట్‌లో ఉన్న వారంతా నాకేమైందోనని కంగారు పడ్డారు. నాకేమీ కాలేదు కానీ బైక్‌ కొద్దిగా డ్యామేజ్‌ అయ్యింది. అందుకే పడ్డానేమో అనుకుంటున్నా. అయినా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు ఎందుకు అంత బరువుగా ఉంటుందో అంటూ ఆ వీడియోను షేర్ చేసింది శ్రద్ద శ్రీనాథ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g0FbQy

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...