Thursday 25 June 2020

ప్లాన్స్ అన్నీ బ్లర్.. సీన్ రివర్స్ అయింది! వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ సందేశం

మెగా ప్రిన్స్ సోషల్ మీడియా వేదికగా ఈ ఏడాది పరిస్థితుల గురించి సింగిల్ లైన్‌లో చెబుతూ సందేశమిచ్చారు. కారణంగా ఈ ఏడాది జన జీవనం స్తంభించి పోవడమే గాక, ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిన సంగతి తెలిసిందే. రోజువారీ కూలీ నుంచి బడా వ్యాపారవేత్త వరకు ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ప్రతీ ఒక్కరినీ కాటేసింది కరోనా. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అంతా అతలాకుతలమైంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయి దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్ల ప్లాన్స్ తలక్రిందులయ్యాయి. అయితే ఇటీవలే తిరిగి షూటింగ్స్‌కి అనుమతి రావడం, కొన్ని సినిమాలు సెట్స్ మీదకు రావడం లాంటి పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ, కరోనా విలయతాండవం చూస్తుంటే అది ఎంతకాలమో అర్థం కాని పరిస్థితి. ఎవ్వరూ ఉహించించని ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు భయటపడతామనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశిస్తూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ సందేశం పోస్ట్ చేశారు. Also Read: 2020.. ఈ ఏడాది వేసుకున్న ప్లాన్స్ అన్నీ బ్లర్ అయ్యాయి అని పేర్కొంటూ మొత్తం పింక్ కలర్‌లో ఉన్న ఓ బ్లర్ పిక్ షేర్ చేశారు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాకు ఒప్పుకున్న వరుణ్.. అందుకోసం ప్రిపేర్ అవుతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న అల్లు బాబీ - సిద్ధూ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VAMWF9

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz