బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో తెరపైకి వచ్చింది. అతడి అకాల మరణం తర్వాత నెపోటిజంపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. సుశాంత్ మరణానికి కారణమంటూ కొందరు తమ వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు బాలీవుడ్ నెపోటిజంపై మండిపడ్డారు. ఇటు టాలీవుడ్‌లో కూడా చాలామంది ప్రముఖులు ఇప్పటికే నెపోటిజంపై స్పందించారు. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా నెపోటిజంపై రేణూ దేశాయ్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మంచి టాలెంట్ ఉన్న నటుడు. సెన్సిటివ్ పర్సన్. ఇండస్ట్రీలో మంచి సక్సెస్‌లు సాధించాడు అని రేణూ పేర్కొన్నారు. అయితే సుశాంత్ మరణానికి నెపోటిజం కారణమని చాలా మంది చెబుతున్నారు. నా అంచనా ప్రకారం నెపోటిజం ఒక్క ఇండస్ట్రీలోనే లేదు. పని చేసే ప్రతిచోట ఉందన్నారు . సినిమా ఇండస్ట్రీలో ముందు మాత్రమే బంధుప్రీతి వర్కవుట్ అవుతుందన్నారు. ఆ తర్వాత మన టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుందన్నారు రేణు. జీవితం టీ కప్పు లాంటిది కాదన్నారామె.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ifP5zM
No comments:
Post a Comment