Sunday, 28 June 2020

Power Star: రామ్ గోపాల్ వర్మ సంచలనం.. ఇతనే పవర్ స్టార్ అంటూ షాకింగ్ వీడియో రిలీజ్

సంచలనాలకు మారు పేరైన మరో సంచలనానికి తెరలేపారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ వేదికలపై హల్చల్ చేస్తూ బోల్డ్ కిక్ ఇస్తున్న వర్మ.. తాజాగా 'పవర్ స్టార్' అంటూ మరో సినిమాను ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పటికే పరిటాల రవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖుల నిజ జీవితాలపై సినిమా తీసిన వర్మ తాజాగా పవన్ కళ్యాణ్‌పై సినిమా తీస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. బ్రేకింగ్‌ న్యూస్‌... ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్‌ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారంటూ ట్వీట్ చేసిన వర్మ.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన సినిమాలో 'పవర్ స్టార్' ఇతనే అంటూ ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు. Also Read: ఈ వీడియోలో అచ్చం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్‌లో ఉన్న ఓ నటుడు.. పవన్ లాగే స్టైల్‌గా నడుస్తూ కనిపించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన వర్మ.. ''నా కొత్త సినిమా పవర్ స్టార్‌లో స్టార్ ఇతనే. ఆయన నా ఆఫీస్‌కి వచ్చినపుడు తీసిన వీడియో ఇది. ఈ వ్యక్తి ఎవ్వరినైనా పోలి ఉంటే నేనైతే ఏమీ చేయలేను. కావాలని చేసిందైతే కాదు'' అంటూ తనదైన స్టైల్ కామెంట్ చేశారు. గతంలో కూడా ఇలాగే పవన్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు వర్మ. ''పవన్‌ గారికి తిక్కుంది.. నాకు లెక్కుంది. కానీ లెక్కకన్నా.. తిక్కే అందరికీ నచ్చుతుంది. అందుకే ఆయన సూపర్‌స్టార్‌ అయ్యారు'' అనడం అప్పట్లో వివాదాస్పదం అయింది. మొత్తంగా చెప్పాలంటే వర్మ తీరు చూసి పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eIVst1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....