Friday 26 June 2020

వైసీపీ ఎంపీని ‘RRR’తో పోల్చుతూ.. వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో కరోనాకు మించిన హాట్ టాపిక్‌గా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మారిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు సొంత పార్టీ తరపున షోకాజు నోటీస్ రావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. వైసీపీ తనకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వగా.. తనకు సీఎం జగన్‌ మీద ఉన్న గౌరవంతో వాటికి సమాధానం ఇస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు సైతం స్పందించారు. ఏపీ రాజకీయాల్లో కొనసాగుతోన్న పరిణామాలను పోల్చుతూ వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఎంపీ వ్యవహారంతో చోటుచేసుకున్న పరిణామాలపై వర్మ ట్వీట్ చే శారు. 'సినిమాను ప్రేమించే రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' ఎప్పుడు విడుదలై సినిమా థియేటర్లను కాపాడుతుందో నాకు తెలియదు. కానీ, జగన్‌ను ప్రేమించే ఆర్‌ఆర్‌ఆర్‌ (రఘురామకృష్ణంరాజు) వైఎస్సార్‌సీపీని కాపాడడానికి ఇప్పటికే వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. అందుకే ఆయన జగన్‌పై స్వచ్ఛ‌మైన ప్రేమను కనబర్చుతారు' అని పేర్కొన్నారు. వర్మ ట్వీట్ పై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా వైసీపీ ఎంపీ పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో వుంటూ సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g4dHJS

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc