Monday 29 June 2020

మహేష్ బాబుకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన రష్మిక

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినీ ప్రముఖుల్లో కూడా అభిమానులు ఉన్నారు. మహేష్‌తో కలిసి నటించే అనేకమంది నటులు ఆయనను ఎంతగానో అభిమానిస్తారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌తో జతకట్టింది కన్నడభామ . తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాలో మహేష్‌ను వేధిస్తోన్న అల్లరిపిల్లగా నటనకు మంచి మార్కులే కొట్టేసింది. దీంతో రష్మికకు కూడా టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ సందర్భంగా రష్మిక తన ఫ్యామిలీతోనే కలిసి ఉంటుంది. రష్మిక మండన్న కూర్గ్ లోని సుందరమైన హిల్ స్టేషన్‌లో తన తల్లిదండ్రులతో కలిసి లాక్ డౌన్ సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. కూర్గ్ ప్రకృతి సౌందర్యం, కొండ పొలాల నుండి గొప్ప పంటలకు ప్రసిద్ది చెందింది. ఈ క్రమంలో కూర్గ్‌లో ఉన్న రష్మిక మహేష్‌కు అదరిపోయే గిఫ్ట్ పంపింది. అవకాడో ఫ్రూట్స్‌తో పాటు...ఆవకాయను ప్యాక్ చేసి మహేష్ ఇంటికి పార్సిల్ పంపింది. పంపిన విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా అద్భుతమైన వాతావరణంలో... నోరూరించే గిఫ్ట్ పంపిన రష్మికకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో మాకు అందిన మొట్టమొదటి గిఫ్ట్ ఇదే అంటూ నమ్రతా తెలిపారు. రష్మిక ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాన్ని మైత్రి ఫిల్మ్ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మికతో పాటు.. ఈ సినిమాలో జగపతి బాబు, యాంకర్ అనసూయ, వెన్నల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళలంలో సుల్తాన్ టైటిల్‌తో వచ్చిన మరోసినిమాలో కూడా రష్మిక నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ibiuL8

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz