Sunday 21 June 2020

MURDER first look: రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం.. వెండితెరపై అమృత, మారుతీ రావు స్టోరీ!

వివాదాస్పద వీరుడు, విలక్షణ దర్శకుడు మరో అడుగేశారు. వరుసపెట్టి సినిమాలు తీస్తున్న ఆయన ఈ సారి , మారుతీ రావుల విషాద గాదపై కన్నేశారు. అదును చూసి ఫాదర్స్ డే సందర్భంగా ఈ రోజు (జూన్ 21) ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పోస్టర్ విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం అయింది ప్రణయ్ హత్య. భార్య (అమృత) ముందే అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు ప్రణయ్. ఈ హత్యకు ప్రధాన సూత్రదారిగా అయిన అమృత తండ్రి మారుతీ రావుపై కేసు నమోదైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనను కాదని ప్రేమ వివాహాం చేసుకోవడంతో అమృత కళ్ళముందే అల్లుడు ప్రణయ్‌ని మారుతీరావు హతమార్చారని విన్నాం. ఇంతలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ తండ్రీ కూతుళ్ళ ఇష్యూ జనాల్లో పలు చర్చలకు దారి తీసింది. ఈ రియల్ స్టోరీనే కథాంశంగా తీసుకొని కొత్త సినిమా రూపొందిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీకి అనే టైటిల్ ఫిక్స్ చేసి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు వర్మ. Also Read: ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ''ఓ తండ్రి తన కుమార్తెను అమితమైన ప్రేమతో పెంచడం వల్ల కలిగే ప్రమాదం. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంగా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్‌ డే రోజున.. ఈ విషాద తండ్రి పోస్టర్‌ను లాంచ్‌ చేస్తున్నాను'' అని పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hMJmkp

No comments:

Post a Comment

'I Plan To Sue This Minister For 100 Cr'

'Her outrageous comments cannot be allowed to slide under the crack.' from rediff Top Interviews https://ift.tt/cMw6vd5