![](https://telugu.samayam.com/photo/76494125/photo-76494125.jpg)
నేడు (జూన్ 21) ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ తమ తండ్రితో అనుబంధాన్ని, ఆప్యాయతను గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తమ తమ తండ్రులతో అనుబంధం తాలూకు విషయాలు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రియాక్ట్ అవుతూ ఆసక్తికర సందేశం పోస్ట్ చేశారు. తన తండ్రి కృష్ణపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ ట్వీట్ పెట్టారు. Also Read: ''నా తండ్రి గురించి చెప్పమంటే.. ప్రేమ, దయ, కరుణ, బలం, ఇతరులపై చూపే జాలి ఈ పదాలే నాకు గుర్తుకొస్తాయి. ఈ రోజు నాలో ఉన్న లక్షణాలన్నీ ఆయన నుండి వచ్చినవే. ఆ లక్షణాలతోనే ప్రయాణిస్తున్నాను. ఆయన నాతో ఎలా ఉండేవారో నేను నా పిల్లలతో అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. హ్యపీ ఫాదర్స్ డే నాన్నా!. నా దారిలో ఎప్పుడూ మీరే ముందుంటారు'' అని పేర్కొన్నారు మహేష్ బాబు. ఈ మేరకు తండ్రితో దిగిన చిన్ననాటి పిక్ షేర్ చేశారు. ఈ ట్వీట్ చూసిన సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతూ 'హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించనుంది. మరికొద్ది ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Z9k1Jh
No comments:
Post a Comment