![](https://telugu.samayam.com/photo/76492505/photo-76492505.jpg)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సినీ, రాజకీయ ప్రముఖులంతా ఒక్కొక్కరుగా భాగమవుతున్నారు. ప్రస్తుతం 3వ దశ కొనసాగుతోంది. “పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల యంగ్ హీరో విశ్వక్‌సేన్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించారు హీరో . ఈ మేరకు ఆదివారం రోజున మొక్కలు నాటి విలువైన సందేశమిచ్చారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో వాతావరణం మనల్ని ప్రశ్నిస్తుంది. పర్యావరణం రక్షించుకోవడం అందరి బాధ్యత. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని రక్షించాలి. ఈ ఛాలెంజ్‌లో నన్ను భాగస్వామ్యం చేసిన చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి, విశ్వక్‌సేన్‌కు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. Also Read: కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో 'గ్రీన్ ఛాలెంజ్' హవా నడుస్తోంది. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ని సెలెబ్రిటీలంతా సాదరంగా స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ఈ బృహత్తర కార్యక్రమంలో రోజా, ప్రభాస్, కృష్ణం రాజు, మంచు లక్ష్మి, సాయి పల్లవి, వరుణ్ తేజ్, సుమ, ఉదయభాను లాంటి ఎందరో సినీ స్టార్స్ పాల్గొని భవిష్యత్ తరాలకు మొక్కల ఆవశ్యకత తెలియజేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2CpgSNv
No comments:
Post a Comment