నేడు (జూన్ 21) సందర్బంగా తండ్రితో తన బంధాన్ని తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు మెగా పవర్ స్టార్ . ఈ మేరకు కొన్ని బంధాలను నిర్వచించాల్సిన అవసరం లేదంటూ తండ్రి చిరంజీవితో తన బాండింగ్ ఎంత పటిష్టమో ఒక్కమాటలో చెప్పేశారు. దీంతో పాటు చిన్నతనంలో తండ్రి తనను ఎత్తుకొని ఆప్యాయంగా ముద్దాడుతున్న పిక్, ప్రస్తుతం చిరుతో గడుపుతున్న సరదా క్షణాల తాలూకు పిక్ షేర్ చేస్తూ ఆత్మీయ సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఫాదర్స్ డే విషెస్ చెప్పారు రామ్ చరణ్. రామ్ చరణ్ షేర్ చేసిన ఈ అరుదైన పిక్స్ చూసి, మెగా తండ్రీకొడుకుల మధ్యనున్న అనుబంధాన్ని పొగుడుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో చెర్రీ పోస్ట్ చేసిన ఈ పిక్స్ కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయ్యాయి. మరోవైపు చిరంజీవి సైతం ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి వెంకట్రావు, కొడుకు రామ్ చరణ్‌కి సంబంధించిన రేర్ పిక్ షేర్ చేస్తూ ఫాదర్స్ డే (పితృ దినోత్సవం) శుభాకాంక్షలు చెప్పారు. Also Read: ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు RRR లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీలో మరో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాపై మెగా, నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అదేవిధంగా చిరంజీవి 152వ సినిమా 'ఆచార్య' లోనూ చెర్రీ కీలకపాత్ర పోషిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2V3y81k
No comments:
Post a Comment