Wednesday, 17 June 2020

నిహారిక పెళ్లి ఫిక్స్ ... మెగా డాటర్ ఆసక్తికర పోస్టు !

టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా మారింది నిహారిక. కూతురు పెళ్లి ఇప్పటికే నాగబాబు కూడా క్లారిటీ ఇచ్చేశారు. నిహారికకు త్వరలో పెళ్లి చేసేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఉంటుందని అన్నారు. తప్పకుండా నెక్స్ట్ సమ్మర్ లో నిహారిక పెళ్లి ఉంటుందని చెప్పడంతో వరుడు కూడా ఫిక్స్ అయ్యి ఉంటాడని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో కొణిదెల వారి ఇంటి నుంచి ఎప్పుడు ఆ శుభవార్త వస్తుందోనని మెగా అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. Read More: తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెటిజన్లలో ఆమె పెళ్లి వార్తలపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. స్టార్ బక్స్ కాఫీ కప్ మీద `మిస్ నీహ` అని రాసి ఉండగా.. s కొట్టేసి..Mrs అనే దానిపై రైట్ మార్క్ వేసింది. మళ్లీ ఓ ట్విస్ట్ కూడా చేసింది. మిస్టర్స్ అనే పదం చివర క్వశ్చన్ మార్క్ కూడా పెట్టింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి `ఉహ్.. వాట్?` అని కామెంట్ చేసింది. ఈ పోస్టును చూసిన చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ కూడా కామెంట్లు పెట్టారు. వై అంటూ ఇద్దరు నిహారికను ప్రశ్నించారు. దీంతో నిహారిక పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. నిహారిక పెళ్లి సెటిల్ అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. కొందరు నెటిజన్స్ ఆమెకు కంగ్రాట్స్ కూడా చెప్పేశారు. కొందరు మాత్రం ఇదంత కొత్త సినిమా ప్రమోషన్ కోసమేనంటున్నారు. ప్రమోషన్‌లో ఇదంతా భాగమేనని కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా డాటర్ పెళ్లికి సంబంధించిన రూమర్స్ గట్టిగా వినిపిస్తున్న సమయంలోనే ఆమె ఒక స్పెషల్ ఫోటో వదిలి అందర్నీ మరింత కన్ఫ్యూజన్ లేకుండా చేసింది. అయితే నిహారిక పోస్టుపై పూర్తి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hA1EWh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....