Wednesday 17 June 2020

అందుకే అక్కడ నటించలేదు... బాలీవుడ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ బాలీవుడ్‌ పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు వస్తున్న వేళ రమ్య చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్‌‌గా మారాయి. ర8మ్యకృష్ణ తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగారు. అటు తమిళంలో కూడా ఆమె హవా అప్పట్లో నడిచింది. 1985లో వచ్చిన ఇద్దరు మిత్రులు’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో వచ్చిన ‘సూత్రధారులు’ చిత్రంద్వారా మంచినటిగా పేరు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. అయితే1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ప్రముఖ నటిగా రమ్యకృష్ణ గుర్తింపు సంపాదించుకుంది. 'కల్‌నాయక్‌' (1993), 'క్రిమినల్‌' (1995), 'శాపత్‌' (1997), 'బడే మియా చోటే మియా' (1998) వంటి చిత్రాలతో హిందీ ప్రేక్షకుల్ని అలరించారామె.అయితే ఆ తర్వాత మాత్రం ఆమె బాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. ఈ నేపథ్యంలో హిందీ సినిమాల్లో ఎందుకు నటించలేదన్న దానికి స్పందిస్తూ రమ్యకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నిజానికి నా సినిమాలు ఉత్తరాదిలో సరిగ్గా ఆడలేదు. అక్కడ నాకు వచ్చిన ఆఫర్లు కూడా ఆసక్తికరంగా లేవు. అందుకే ఇన్నేళ్లు నటించలేదు. దక్షిణాదిలో నేను విజయవంతంగా రాణిస్తున్నా' అని చెప్పారు రమ్యకృష్ణ ప్రస్తుతం రమ్యకృష్ణ పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలిలో శివగామి పాత్రలో ఆమె నటన అందరిని ఆకర్షించింది. ఆ తర్వాత 'శైలజా రెడ్డి అల్లుడు'లో మరో మెయిన్ రోల్‌లో మెరిశారు. ఆతర్వాత రమ్యకృష్ణ కన్నడ, మలయాళ, తమిళ ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'ఫైటర్‌' సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. విజయ్‌ దేవరకొండ కథానాయకుడు. అనన్యా పాండే కథానాయిక. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ తల్లిగా 'శివగామి' కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. 'బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ దీనికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతోంది. తెలుగు దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్న రమ్యకృష్ణకు ఇద్దరు కుమారులు. వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hH9pcL

No comments:

Post a Comment

'What Was Samsung Doing For 16 Years?'

'Samsung declared they would not allow the presence of any trade union.' from rediff Top Interviews https://ift.tt/py9LrCB