నీళ్లల్లో దిగి ఇంటర్వ్యూలు చేసే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ మీడియా ముందు వచ్చి రచ్చ చేశారు తమిళ నటుడు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దర్శన్. తమిళ నటి , దర్శన్ చాలాకాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ దర్శన్ తనను మోసం చేశాడంటూ సనమ్ నిన్న పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు కాదంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో తన గురించి వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ ఇప్పుడు దర్శన్ మీడియా ముందుకు వచ్చారు. ‘‘నాకు సనమ్‌తో నిశ్చితార్థం అయిన విషయం నిజమే. కానీ మా ఇంట్లో వారికి ఈ విషయం గురించి తెలీదు. ఎక్కడ తెలిస్తే నా చెల్లికి ఎక్కడ పెళ్లి జరగదోనని చెప్పలేదు. ఓసారి సనమ్ అండర్‌వాటర్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది నాకు నచ్చలేదు. అలా ఎందుకు చేశావని అడిగితే నా కోసమే అని చెప్పింది. నేను బిగ్‌బాస్ షో నుంచి బయటికి రాగానే నాపై అధికారం చెలాయించడం మొదలుపెట్టింది. నా తోటి కంటెస్టెంట్స్‌తో మాట్లాడకూడదని షరతులు పెట్టింది. నేను వెళ్లే ప్రతీ ఈవెంట్‌కు తనను కూడా తీసుకెళ్లాలని పట్టుబట్టింది. నేను సంతకం చేసిన సినిమాలకు సంబంధించిన నిర్మాణ సంస్థలకు వెళ్లి నేను మంచివాడిని కానని చెప్పి లేనిపోని అబద్ధాలు చెప్పింది" READ ALSO: " నా చెల్లి పెళ్లి అయ్యాక నేను సనమ్‌ను పెళ్లి చేసుకోవచ్చని నా తల్లిదండ్రులు చెప్పారు. మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది. ఈ సమస్యలన్నీ నా కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయి. అందుకే తనతో బంధం తెంచుకోవాలని అనుకున్నాను. ఇంత జరిగాక నేను ఆమెను అస్సలు పెళ్లి చేసుకోలేను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. రేపు కమిషనర్ ఆఫీస్‌కి వెళ్లి ఈ ఆధారాలు చూపిస్తాను’ అని తెలిపాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tml6Bw