Saturday, 25 January 2020

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ స్టార్ డైరెక్టర్‌

ఒక్కోసారి ప్రమాదాలు ఎటువైపు నుంచి వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. సాధారణ వ్యక్తుల విషయంలోనే కాదు ఒకసారి సెలబ్రిటీ విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ ప్రముఖ దర్శకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఉదయం వాకింగ్ చేద్దామని రోడ్డు మీదకు వెళ్లిన ఓ స్టార్‌ డైరెక్టర్ రోడ్లు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. ఇక అసలు విషయానికి వస్తే తమిళ్‌లో నాన్‌ మహాన్‌ అల్లా, రాజా పట్టాయ్‌, జీవా, పాయంపులి లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం వాకింగ్ చేసేందుకు రోడ్డు మీదకు వెళ్లిన సుశీంద్రన్‌ను ఓ ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేయి విరింగింది. గాయాలు తీవ్రంగా కావటంతో ఆయన్ను కొద్ది రోజులు అబ్జర్వేషన్‌ ఉండాలని వైధ్యులు సూచించారు. Also Read: ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది , ఛాంపియన్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాదించాయి. దర్శకుడిగానే కాక నామ్‌, దీపావళి, సుట్టు పిడిక్క ఉత్తరవు సినిమాల్లో నటుడిగానూ ఆకట్టుకున్నాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NZIo78

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....