Thursday 30 January 2020

నాగశౌర్య ‘అశ్వథ్థామ’ ట్విట్టర్ రివ్యూ: సస్పెన్స్ రైడ్

‘ఛలో’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య.. తన లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ‘అశ్వథ్థామ’గా నేడు (జనవరి 31) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమ్మాయిల మీద జరుగుతున్న ఆరాచకా ఎదురొడ్డే కుర్రాడే కథే ‘అశ్వథ్థామ’. ఓ యూనిక్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి కథ అందించింది నాగశౌర్యనే కావడం విశేషం. యువ దర్శకుడు రమణతేజ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్ నటించింది. టైటిల్, ఫస్ట్ లుక్, ట్రైలర్‌లతో ఈ సినిమా అంచనాలను పెంచేసిన ‘అశ్వథ్థామ’ మూవీ ఇప్పటికే యుఎస్‌లో ప్రీమియర్ షోలు పడటంతో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు నెటిజన్లు. నాగశౌర్య ఫస్ట్ టైమ్ మాస్ అండ్ రగ్డ్ డ్ లుక్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడని.. ఆయన ఎంటైర్ కెరియల్‌లో గత చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రంలో మరో ఎత్తు అని శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ .. గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్‌గా ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు. ఫస్టాఫ్ మొత్తం సస్పెన్స్ రైడ్‌గా సాగిందని, హీరో సిస్టర్‌కి జరిగిన పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్‌తో ‘అశ్వథ్థామ’ ఎమోషనల్‌గా ఉందంటున్నారు. ‘ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు.. వేట కుక్కలాగా వెంటపడే జాలర్లు.. శకుని లాంటి ఒక ముసలోడు.. వీళ్లందర్నీ ఒకేస్టేజ్ మీద ఆడిస్తున్న ఆ సూత్రధారి ఎవరు’? అంటూ ట్రైలర్‌తో విలన్ ఎవరా? అన్న ఆసక్తి కలిగించిన దర్శకుడు ఈ చిత్రంలో విలన్ క్యారక్టరైజేషన్‌గా బాగా ప్రజెంట్ చేశారని.. జీబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అంటున్నారు. పోస్ట్ ఇంట్రవల్‌లో విలన్ ఇంట్రో ఎపిసోడ్ థ్రిల్లింగ్ అనిపిస్తుందని.. అయితే సాంగ్స్, క్లైమాక్స్ తేలిపోయాయని అంటున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్‌తో సినిమా ప్రారంభం కావడం మరో థ్రిల్లింగ్ అంటున్నారు పవన్ ఫ్యాన్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vBtAFD

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc