Wednesday, 29 January 2020

NTR: ఆ హీరోలకూ తారక్ లాంటి ఫ్యాన్స్ ఉంటే.. చలపతిరావు కామెంట్స్

అభిమానుల యందు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఉన్న అభిమానులు వేరనే చెప్పాలి. తారక్ కోసం ఎంత దాకానైనా వెళ్తారు. ఎన్ని మంచి కార్యక్రమాలైనా చేపడతారు. తారక్ పేరుతో ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ‘తారక్ టీం ట్రస్ట్ ఛారిటీ’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఫ్యా్న్స్ అంతా ఏకమై అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, పేదలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేయడం, వారికి అనారోగ్య సమస్యలు ఉంటే చందాలు వసూలు చేసి చికిత్సలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఈ ట్రస్ట్ పెట్టి నేటికి ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో తారక్ ఫ్యాన్స్ 33 ఈవెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు చలపతిరావు తారక్ ఫ్యాన్స్ చేస్తున్న మంచి పనిని ఉద్దేశిస్తూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ మా తారక్ గాడి పేరు మీద ఓ టీంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటివరకు 33 ఈవెంట్స్ చేశారంటే చాలా ఆనందమేసింది. నా కళ్లు చెమర్చాయి. వృద్ధులు, నడవలేని వారికి భోజనాలు పెట్టడం, దుప్పట్లు పంచడం, అసవరమైన వస్తువులు కల్పించడం.. ఇవన్నీ చూస్తుంటే మా తారక్ గాడి జన్మ ధన్యమైంది. ఆర్టిస్ట్ అవ్వడం గొప్ప కాదు. ఆ ఆర్టిస్ట్ పేరుతో ఇన్ని సేవా కార్యక్రమాలు చేసే ఫ్యాన్స్ ఉండటం గొప్ప. మా తారక్ తరఫున ఈ యూనిట్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’’ READ ALSO: ‘‘ ప్రపంచంలో ఎవ్వరికీ భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పెద్ద గారు. ఆయన ఎవ్వరికీ భయపడలేదు. ఆయన అడుగుజాడల్లో మేం నడుస్తున్నాం. ఆయన చేసిన గుప్తదానాలు ఎవ్వరికీ తెలీదు. నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు. కానీ ఈ తరానికి పెద్దన్న జూనియర్ ఎన్టీఆర్ రూపంలో వచ్చారు. తారక్ కూడా ధైర్యవంతుడు. ఎవరు ఎన్ని ఫోన్లు చేసి బెదిరించినా వాడు భయపడడు. ధైర్యంగా తారక్ అభిమానులు ముందుకొచ్చి 33 ఈవెంట్స్ చేశారంటే చాలా గొప్ప విషయం. తారక్ అభిమానులంతా సైనికులులాంటివారు. ఎవ్వరికీ భయపడరు. వారంతా తారక్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. తారక్ ఎంత గెట్టోడో వీళ్లూ అంతే గెట్టోళ్లు. తారక్ యంగ్ టైగర్. తాతగారి ఆశయాలను అమలు చేస్తున్నాడు. ఏదన్నా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోగలడు. అనుకున్నది చేస్తాడు. ఇదే అందరి హీరోల శిష్యులు చేయగలిగితే బాగుంటుంది. కానీ ఆ మాట నేను అనకూడదు. ఎవరి ఇష్టం వారిది’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36JHna8

No comments:

Post a Comment

'Paatal Lok Is Sacred To Me'

'I was feeding off the bond that Ansari and Hathiram had formed during season one.' from rediff Top Interviews https://ift.tt/k435...