ప్రముఖ సినీ నటి రాధ ప్రశాంతి ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్నవారు. సమాజం ఏమనుకుంటుంది, ఇతర నటీనటులు ఏమనుకుంటారు అన్న విషయాలతో సంబంధం లేకుండా తప్పు ఎవరు చేసినా ముఖం మీదే చెప్పేస్తారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆవిడను ఇప్పుడు పట్టించుకునే నాథుడు కూడా లేడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యురాలు అయినప్పటికీ వారు కూడా ముఖం చాటేశారట. ఈ సంచలన విషయాలన్నీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘మా’కు పదవులే ముఖ్యం ‘‘నేను ‘మా’ అసోసియేషన్ సభ్యురాలినే. మొన్న అనారోగ్యానికి గురైతే మా నుంచి ఒక్కరు కూడా వచ్చి నన్ను పరామర్శించలేదు. ఎందరో ఛానెల్స్ వాళ్లు ఫోన్లు చేసి అడిగారు కానీ మా మాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు అధ్యక్షుడు నరేష్‌ని సినీ అవకాశాలు ఇప్పించాలని అడిగితే ఆయన కూడా చూద్దాంలే అని ఊరుకున్నారు. ‘మా’లో ఉన్నవారికి పదవులపై ఆశలు తప్ప ఆర్టిస్ట్‌లకు సాయం చేయాలన్న ఆలోచన లేదు. నరేష్ ఒక్కరే కాదు మురళీ మోహన్, శివాజీ రాజాలను కూడా సినిమా అవకాశాలు ఇప్పించాలని అడిగాను. గెలిచాక చూద్దాం అన్నారు. అవకాశాలు లేక నా వద్ద మెడికల్ క్లెయిమ్‌కి కూడా డబ్బులు లేవు. దాంతో ఈ ఒక్క ఏడాది కట్టలేను అని చెప్పాను. ఇందుకు ‘మా’ ఒప్పుకోలేదు. మొన్నటి వరకు మెడికల్ క్లెయిమ్ కట్టిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు కట్టడంలేదు అని వాళ్లు కొంచెం అయినా ఆలోచించాలి కదా’’ ఆర్టిస్ట్ బతికున్నప్పుడు పట్టించుకోరు ‘‘ ‘మా’ అసోసియేషన్ వాళ్లు ఆర్టిస్ట్‌లు బతికున్నప్పుడు పట్టించుకోరు కానీ చనిపోయాక మాత్రం శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు. ఇదెక్కడి న్యాయం అండి. ఆర్టిస్ట్‌లకు అవకాశాలు దర్శకులు, నిర్మాతలే ఇవ్వాలి అంటారు. మరి ‘మా’లో గెలిచినవారికి మాత్రమే ఎలా అవకాశాలు వస్తున్నాయి. మాకెందుకు రావడంలేదు? ఇండస్ట్రీల కుల రోగం బాగా ఉంది’’ READ ALSO: నా బెడ్‌రూంలో సీసీ కెమెరాలు పెట్టారు ‘‘నేను నాలుగు అంతస్థులు ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను. కొన్నేళ్ల క్రితం అపార్ట్‌మెంట్‌లో షూటింగ్ అని చెప్పి నేనుంటున్న ఇంటిపైన వ్యభిచారం చేసేవాళ్లు. నేను ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాను. కానీ తెలంగాణ పోలీసులు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఓ మహిళా అధికారిణి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఇవన్నీ కామనే అండీ అంది. మా పక్కింటో ఓ వెధవ ఉంటాడు. వాడికి ఆడవాళ్లపైనే ధ్యాస. నాకు తెలీకుండా నా బెడ్‌రూం, బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టాడు. దీనిపై ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. దాంతో నేనే ఆ కెమెరాలను పీకి పడేశాను’’ READ ALSO: నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాను ‘‘నా భర్త కిరణ్ ఒకప్పుడు కాంగ్రెస్‌లో ప్రజాప్రతినిధిగా పనిచేశారు. ఆయనకు కోట్లల్లో ఆస్తులు ఉన్నాయి. నేను సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే ఎక్కడో ఆయన నన్ను చూసి ఇష్టపడ్డాడట. వెంటనే నా నెంబర్ సంపాదించి నా తమ్ముడికి ఫోన్ చేసి పెళ్లి గురించి మాట్లాడారు. పెళ్లికంటే ముందు ఓ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. నేను ఆయనకు సంబంధించిన యాడ్ కంపెనీలో ఓ ప్రకటనలో నటించాలట. ఇలాంటివేవీ కుదరవు అని చెప్పాను. ఎందుకంటే నేను తమ్ముడు, చెల్లిని చూసుకోవాలి. దాంతో కిరణ్ నిద్రమాత్రలు మింగి సూసైడ్‌కు యత్నించారు. వాళ్లింవారు నా దగ్గరకు వచ్చి మొత్తుకున్నారు. నీ వల్ల నా బిడ్డ పోతే పరిస్థితేంటి? అని ఏడ్చారు. అతనేమైనా నాకు చెప్పి నిద్రమాత్రలు మింగాడా అని వారించాను. వాళ్లు బాగా డబ్బున్నవారు అని చెప్పి నా తమ్ముడు పెళ్లికి ఒప్పించాడు. అలా షిర్డీలో మా పెళ్లి జరిగింది’’
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RYtZcR
No comments:
Post a Comment