Thursday, 30 January 2020

HIT Teaser: కళ్లార్పలేనంత థ్రిల్.. నాని ఖాతాలో మరో ‘హిట్’

నేచురల్ స్టార్ నిర్మాతగా తొలి సినిమా ‘అ’తోనే మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘హిట్’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మాస్ హీరో విశ్వక్‌సేన్ ఇందులో కథానాయకుడిగా నటించారు. ‘చిలసౌ’తో హీరోయిన్‌గా పరిచయం అయిన రుహానీ శర్మ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ‘హిట్’ సినిమా టీజర్‌ను నాని ఈరోజు రిలీజ్ చేశారు. ఓ మిస్సింగ్ కేసును విచారణ చేసే అధికారి విక్రమ్ పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. ‘ఈ జాబ్ నిన్ను రిస్క్‌లో పెడుతుంది విక్రమ్. నువ్వు ఈ డిపార్ట్‌మెంట్ వదిలి వెళ్లిపోవాలి’ అని ఓ యువతి విశ్వక్‌సేన్‌తో చెబుతుంది. ‘ఈ డిపార్ట్‌మెంట్‌ని మాత్రం వదిలేది లేదు’ అని విశ్వక్ సేన్ అంటారు. ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్‌కు బాగా కావాల్సిన వారిని కళ్లముందే కత్తితో పొడిచి చంపేస్తారు. ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో టీజర్ రసవత్తరంగా సాగింది. విశ్వక్ సేన్, రుహానీ శర్మ లిప్ కిస్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ టీజర్ రిలీజ్ చేస్తూ.. ‘సీట్లను అతుక్కుని సినిమా చూస్తారు’ అని నాని క్యాప్షన్ ఇచ్చారు. READ ALSO: టీజర్‌తోనే అంచనాలను పెంచేశారు ‘హిట్’ టీం. మరి సినిమా ఎలా ఉండోబోతందో తెలియాలంటే ఫిబ్రవరి చివరి వారం వరకు ఎదురుచూడాలి. కొలను శైలేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. See Photo Story:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36EJiwp

No comments:

Post a Comment

Peepli [Live] Director Returns With A Wonderful Film!

Writer and director Anusha Rizvi returns to cinema after 15 years with warmth, wit and many a laughs. from rediff Top Interviews https://i...