Friday, 31 January 2020

చచ్చిపోతాను, నా వల్ల కావడంలేదు: మాధవీలత షాకింగ్ పోస్ట్

నటి, బీజేపీ నేత నిన్న సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఉన్నట్టుండి నాకు చనిపోవాలని ఉంది అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అయితే తాను ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తాజాగా వివరించారు. ‘నేనెప్పుడూ నా ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉంటాను.. ఏదో ఒక రోజు ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా అని ఫేస్‌బుక్‌లో పేర్కొంది. అందులోలాగే తాను కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటున్నా అని.. చివరికి ఎలాంటి మెడిసిన్స్ పని చేయవేమో.. అని ఎప్పుడూ ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్‌కి కూడా చెబుతూ ఉంటానని పేర్కొంది. తను మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో సఫర్ అవుతున్నానని.. దీంతో రోజూ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుందని’ ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. అయితే ఈ పోస్ట్‌‌ని చూడగానే ఫ్యాన్స్, ఫాలోవర్స్ కంగుతిన్నారు. అసలు మాధవీలత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దీనిపై మాధవిలత క్లారిటీ ఇచ్చారు. ‘ఈ రకంగా క్లారిటీ ఇస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. నాకున్న సమస్యల గురించి ఆ పోస్ట్‌లో వివరించాను కానీ చచ్చిపోవాలని అనుకుంటున్నట్లు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. నాకు మైగ్రేన్ ఉంది. దాని వల్ల రోజూ మెడిసిన్స్ తీసుకుంటున్నాను. మెడిసిన్స్ ఎక్కువగా వాడితే ఆయుష్షు తగ్గిపోతుంది. నాకే కాదు ఎవరికైనా అంతే’’ READ ALSO: ‘‘నేను మైగ్రేన్ వల్ల ఇన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కాబట్టి నేను కూడా ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చనిపోతానేమోనని అన్నాను కానీ చనిపోవాలని అనుకుంటున్నట్లు మాత్రం ఎక్కడా చెప్పలేదు. తప్పుగా ప్రచారం చేయకండి. నాకు ఒంట్లో బాలేదు. మెడిసిన్స్ ఎక్కువగా వాడటం వల్ల విరక్తి కలిగి ఆ పోస్ట్ పెట్టాను. నేను అన్నీ ఫేస్‌బుక్‌లోనే పంచుకుంటాను. దీని ద్వారా ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏదో కాజ్యువల్‌గా నా అనారోగ్య సమస్యల గురించి షేర్ చేసుకున్నాను. మీడియా వర్గాలు దయచేసి ఇలా ప్రచారం చేయొద్దు’ అని వివరణ ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/319O6cd

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....