Saturday, 25 January 2020

రేస్‌కు రెడీ అంటున్న సీనియర్‌ హీరో.. సమ్మర్‌లో షురూ!

వరుస విజయాలతో దూసుకుపోతున్న సీనియర్‌ హీరో అదే జోరు సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఎఫ్‌ 2, వెంకీ మామ సినిమాలతో సూపర్‌ హిట్‌లు అందుకున్న వెంకీ ప్రస్తుతం తమిళ సూపర్‌ హిట్‌ అసురన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పల్లెటూరి వ్యక్తిగా వెంకీ లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఇటీవల రిలీజ్‌ అయిన లుక్‌కు ఆడియన్స్‌ నుంచి కూడా మంచి రెస్సాన్స్‌ వస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా పూర్తయిన తరువాత వెంకీ చేయబోయే సినిమా కూడా ఇప్పటికే ఫిక్స్‌ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. చాలా రోజులుగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు వెంకీ. Also Read: గతంలోనే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో సమ్మర్‌లో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. హార్స్‌ రేసింగ్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎక్కువ భాగం మలక్‌పేట్‌ రేస్‌ కోర్టు చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదలైన వెంకీ మామ సినిమాలో రియల్‌ లైఫ్‌ మేనల్లుడు నాగచైతన్యకు రీల్‌ లైఫ్‌లోనూ మామగా నటించాడు వెంకీ. ఈ సినిమా వెంకీ, చైతూల కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న నారప్ప సినిమాను తమిళ నిర్మాత కలైపులి ఎస్‌ థానుతో కలిసి సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uBsAk5

No comments:

Post a Comment

'Labour Codes Will Reduce Take-Home Salary Is Wrong'

'It will increase the contribution to gratuity, which is something the employer has to give.' from rediff Top Interviews https://i...