Monday, 27 January 2020

Rajinikanth: ‘‘నాకు మద్యం అలవాటు చేసింది రజినీకాంతే.. తాగకపోతే ఇండస్ట్రీలో ఉండవన్నారు’’

ఒకప్పుడు విలన్ పాత్రల్లో నటించి చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు . ‘యజ్ఞం’ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో తనకున్న స్నేహితుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను రంగరాజు వెల్లడించారు. ‘‘నాకు మద్యం అలవాటు లేదు. ఓసారి నేను, రజినీకాంత్ కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తుంటే.. ఆయన మద్యం బాటిల్ తీశారు. నేను తాగకుండా చూస్తూ కూర్చున్నాను. ఆయన చూసి ఎంటి నువ్వు తాగట్లేదు అన్నారు. నాకు అలవాటు లేదు సర్ అన్నాను. ఆయనకు మండింది. పోనీ పాలు తెచ్చి ఇవ్వనా అంటూ వెటకారంగా అడిగారు. తాగుతావా లేదా అని బలవంతంగా పెగ్ పోశారు. నేను ఒక గ్లాస్ తాగి ఆపేశాను. అదేంటి ఒక్కటే తాగావ్ అని మరో పెగ్ పోశారు. తాగకపోతే తమిళ ఇండస్ట్రీలో నీకు స్థానం ఉండదు అని సరదాగా ఆటపట్టించారు. మనకు కూడు పెట్టేది సినిమానే కదా ఎందుకొచ్చిన గొడవలే అనుకుని తాగడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత భోజనం చేశాను. తీరా ఉదయం లేచి చూస్తే ఇంట్లో ఉన్నాను. మెలకువ రాగానే మా అమ్మ వచ్చి నన్ను చెప్పుతో కొట్టింది" READ ALSO: " ఒక్కగానొక్క కొడుకునని బాగా గారాబంగా పెంచారు. సినిమాల్లోకి వెళ్లి రజినీకాంత్‌తో కలిసి నటించే అవకాశం తెచ్చుకున్నావ్.. ఇదెక్కడి అలవాటు అని బండబూతులు తిట్టింది. ఆ తర్వాత జరిగినదంతా చెప్పాను. నాకు మద్యం అలవాటు చేసింది రజినీకాంతేనని తెలిసి మా అమ్మ చాల బాధపడింది. మా అమ్మ బాధపడటంతో నాకు కోపం వచ్చింది. గొడవపెట్టుకోవడానికి రజినీకాంత్ వద్దకు వెళ్లాను. కానీ నేను ఆయన్ను ఏమీ అనలేకపోయాను. ఆ తర్వాత ఇద్దరం చాలా సినిమాల్లో నటించాం. నాకు తెలుగులో రాజీవ్ కనకాలతో మంచి పరిచయం ఉంది’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GqmoOG

No comments:

Post a Comment

Peepli [Live] Director Returns With A Wonderful Film!

Writer and director Anusha Rizvi returns to cinema after 15 years with warmth, wit and many a laughs. from rediff Top Interviews https://i...