Friday, 31 January 2020

Allu Arjun: నా రికార్డ్ మరోకరు బీట్ చేయాలని కోరుకుంటున్నా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి జీవితంలో మర్చిపోలేని హిట్ ఇచ్చింది ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. నివేదా పేతురాజ్, సుశాంత్, టబు, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సాధించింది. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇటీవల సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సినిమా టీం నిన్న థ్యాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను చాలా చక్కగా అభిమానులతో పంచుకున్నారు. ‘ముందుగా సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు మీడియాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ మీట్ ఎందుకు పెట్టామంటే.. మా దగ్గర ప్రొడక్షన్ కంపెనీ కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసేవాళ్లు ఎప్పుడూ నన్ను ఓ మాట అడుగుతూ ఉంటారు. ఏంటండీ ఎప్పుడు సినిమా హిట్ అయినా మీరు మీ టీం మాత్రమే సక్సెస్ మీట్స్ నిర్వహిస్తుంటారు. మా గురించి పట్టించుకోరా, మాకు షీల్డ్ ఇచ్చి సత్కరించరా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు వారికి ఓ మాట చెప్పాను. డిస్ట్రిబ్యూటర్స్‌కి షీల్డ్స్ ఇచ్చి సత్కరించేంత గొప్పగా నా సినిమా ఆడినప్పుడు తప్పకుండా ఫంక్షన్ చేస్తాను అని’’ READ ALSO: ‘‘ఆ కోరిక ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తీరింది. నాకు ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ ఇచ్చింది. ఈ రికార్డును మరో సినిమా బ్రేక్ చేస్తే అప్పుడే సినీ పరిశ్రమ మరో మెట్టు ముందుకు వెళ్లినట్లు. కాబట్టి నా రికార్డును మరెవరైనా బ్రేక్ చేయాలని ఆశిస్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ప్రేక్షకులకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఈ సినిమాలోని ‘సిత్తరాల సిరపడు’ పాటలో సిగరెట్ తాగుతూ కనిపిస్తాను. కానీ దయచేసి మీరు మాత్రం నన్ను ఫాలో అయి సిగరెట్ కాల్చడం వంటివి చేయకండి. నేను సినిమాలో ఆ పాత్ర వరకు సిగరెట్ తాగాను. నాకు నిజ జీవితంలో అసలు ఆ అలవాటే లేదు. అది మంచిది కాదు కూడా’’ అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3baOXOq

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...