Tuesday, 28 January 2020

వైరల్: మంచు మనోజ్‌కి రెండో పెళ్లా..? వామ్మో!

మంచు వారి చిన్నబ్బాయి సోలో లైఫ్ సో బెటర్ అని పెళ్లికి బ్రేకప్ చెప్పేసి సింగిల్‌గా కంటిన్యూ అవుతున్నారు. ఇటీవల తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు మంచు మనోజ్. ఇక సినిమా పరంగాను మంచు మనోజ్ లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం తరువాత సినిమాలకు దూరమైన మనోజ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు. స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు.. సినిమా రిలీజ్ అప్పుడు ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు షేర్ చేసే మంచు మనోజ్ ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా సెట్ అయ్యిందని.. ఈ వీక్‌లో తన నుండి ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ ఉండబోతుంది.. వేచి చూడండి’ అంటూ పోస్ట్ పెట్టారు. అయితే మంచు మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం ఏంటంటే.. మనోజ్ ట్వీట్‌కి నెటిజన్ల నుండి ఆసక్తికరమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటి అన్నా..? మళ్లీ రెండో పెళ్లి చేసుకోబోతున్నావా? కొత్త వదిన వస్తుందా? మళ్లీ పెళ్లా? కొత్త వదిన కోసం వెయిటింగ్ అన్నా? మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ఆయన పెళ్లిపై ఫన్సీగా స్పందిస్తున్నారు. అయితే నెటిజన్ల కామెంట్స్‌ స్పందిస్తూ ‘వామ్మో’ అని రిప్లై ఇచ్చారు మంచు మనోజ్. See Photo Story: అయితే మనోజ్ చేసిన ట్వీట్ పెళ్లి గురించి కాదని.. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించింది అని కొందరు అంటుంటే.. మనోజ్ కొత్త బ్యానర్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మనోజ్ చెప్పే ఆ కొత్త విషయం ఏంటో తెలియదు కాని.. మనోజ్‌ రెండో పెళ్లి అంటూ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38JSktt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....