Saturday, 25 January 2020

`మహా సముద్రం`లోకి యంగ్ హీరో.. ఈ సారైనా పట్టాలెక్కుతుందా!

సినీ ఇండస్ట్రీ సక్సెస్‌ వెంటే పరిగెడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఏ దర్శకుడికైనా ఒక్క హిట్ వస్తే చాలా వెంటనే హీరోలు నిర్మాతలు క్యూ కట్టేస్తారు. కానీ అన్ని సందర్భాల్లో ఇలా జరగదు. ఓ బ్లాక్‌ బస్టర్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఓ డైరెక్టర్‌ రెండో సినిమాను ప్రారంభించడానికి పెద్ద యజ్ఞమే చేస్తున్నాడు. రా బోల్డ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిన ఘన విజయం సాధించిన సినిమా ఆర్‌ఎక్స్‌ 100. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు . రామ్‌ గోపాల్‌ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అజయ్‌ తొలి సినిమాతోనే తన మార్క్‌ చూపించాడు. ఆర్‌ఎక్స్‌ 100 సూపర్‌ హిట్ కావటంతో ఒక్కసారిగా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు అజయ్‌. Also Read: అదే జోరులో రెండో సినిమాకు రెడీ అయ్యాడు. ఇద్దరు యంగ్ హీరోలతో ఓ మల్టీ స్టారర్‌ సినిమాను ప్లాన్ చేశాడు. కానీ కథ వర్క్‌ అవుట్ కాలేదో లేక హీరోల డేట్స్‌ అడ్జస్ట్ కాలేదో తెలియదుగానీ ఇంత వరకు అజయ్‌ రెండో సినిమా పట్టాలెక్కలేదు. అనే టైటిల్‌ను చాలా కాలం కిందటే ఎనౌన్స్‌ చేసినా ఆ సముద్రాన్ని దాటే కథానాయకుడు మాత్రం ఇంత వరకు సెట్ కాలేదు. ముందుగా ఈ కథను ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ చెప్పాడన్న టాక్‌ వినిపించింది. మరో హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తాడన్న ప్రచారం కూడా జరిగింది. తరువాత సీన్‌లో రవితేజ పేరు వచ్చింది. ఆ తరువాత హీరోలు ఎవరు అంగీకరించకపోవటంతో తానే ఒక హీరోగా నటించేందుకు అజయ్‌ రెడీ అవుతున్నాడన్న టాక్‌ వినిపించింది. ఫైనల్‌గా నాగచైతన్య ఈ సినిమాకు ఓకె చెప్పాడన్న వార్త వినిపించింది. Also Read: తాజాగా నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. దీంతో మరో యంగ్ హీరో శర్వానంద్‌కు కథ వినిపించిన అజయ్‌ భూపతి, త్వరలోనే సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం తమిళ సూపర్‌ హిట్ 96కు రీమేక్‌గా తెరకెక్కుతున్న జాను సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్‌ తరువాత మహా సముద్రం సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37qHLLO

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...