Saturday, 25 January 2020

Ravi Teja: `డిస్కో రాజా` బర్త్‌డే స్పెషల్.. `క్రాక్‌` రిలీజ్‌ ఎప్పుడంటే!

ఇటీవల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ హీరో మాస్ మహరాజ్‌ ఈ రోజు (26-01-2020) పుట్టిన రోజుజరుపుకుంటున్నారు ఈ సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా పరవాలేదనిపిస్తోంది. దీంతో మాస్‌ మహరాజ్‌ అభిమానులు ఆనందంగా ఉన్నారు. Also Read: డిస్కో రాజా సెట్స్‌ మీద ఉండగానే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు రవితేజ. మాస్‌ మహరాజ్‌ ఇమేజ్‌, ఎనర్జీకి తగ్గట్టుగా ఈ సినిమాకు క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. రవితేజ పోలీస్‌ ఆఫీస్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌పై బీ మధు నిర్మిస్తున్నాడు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. Also Read: ప్రస్తుతం చిత్రకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ సినిమాతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కనున్న మరో సినిమాను ఎనౌన్స్ చేశారు. యాక్షన్‌ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను యంగ్ హీరో హవీష్‌ నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు మాస్‌ మహరాజ్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36tgffl

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...