Monday, 27 January 2020

Sunil: రవితేజ 200 ఏళ్లు బతుకుతారు... నేను విలన్‌గా చేసుకోవచ్చు

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘డిస్కోరాజా’ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఆదివారం సినిమా సక్సెస్ మీట్ జరిగింది. మీట్‌లో కమెడియన్ హిలేరియస్ స్పీచ్ ఇచ్చారు. ‘‘మీ అందరికీ తెలీని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రక్త ప్రసరణ సరిగ్గాలేక, రోజూ వ్యాయామలు చేయకపోవడం వల్ల ప్రపంచం మొత్తంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ఉన్నారట. మన చేతి వేళ్ల వరకు రక్తప్రసరణ బాగా జరిగితేనే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు అంటున్నారు. అలా ఉండాలంటే రోజుకు 20 కిలోమీటర్లు నడవాలంట. ఆ 20 కిలోమీటర్లు నడవకపోతే రెండు చేతులతో గట్టిగా చప్పట్లు కొడితే చేతి వేళ్ల వరకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టడండి. నేను తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత జీవితంలో మర్చిపోలేని పాత్రను నాకు ఈ సినిమాలో ఇచ్చారు. నాలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు’’ READ ALSO: ‘‘అందుకు దర్శకుడు వీఐ ఆనంద్‌కు ధన్యవాదాలు చెప్పుకోవాలి. దీని తర్వాత కన్నడ, మలయాళం, తమిళంలోనూ నేను సిక్స్ ప్యాక్ పెంచిన తెలుగు విలన్ పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. మామూలుగా ఓ సినిమాలో ఐదు నిమిషాలు సస్పెన్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం. పది నిమిషాలంటే ఇంకా కష్టం. కానీ క్లైమాక్స్ దాకా సస్పెన్స్‌తో సినిమాను నడిపించాలంటే తాటతీసేస్తది స్క్రిప్ట్ రాసేటప్పుడు. అంత గొప్ప ప్రయోగం చేసినందుకు ఆనంద్‌కు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్‌తో కథలు తీసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సినిమాలో రాంకీ గారు కూడా చాలా బాగా నటించారు. నేను సెట్‌కి వెళ్లగానే రాంకీ గారు ఉన్నారు. ఆయన్ను చూడగానే కేవలం జుట్టుకు రంగు పూసారని అనిపించింది’’ READ ALSO: ‘‘ లుక్స్ పరంగా ‘సింధూరపువ్వు’ సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇకపోతే సినిమాలో ప్రధాన పాత్ర అయిన రవితేజ అన్న గురించి చెప్పాలంటే.. ఆయన స్టైల్, యాటిట్యూడ్, మెచ్యూరిటీ సినిమాను నడిపించేసింది. మనిషిలో ఈ మూడు సహజంగా ఉంటే తప్ప ఇలాంటి పాత్రల్లో నటించలేరు. అందరికీ దేవుడు వందేళ్ల జీవితాన్ని ఇస్తాడు. కానీ మనం 50 ఏళ్లే బతుకుతాం. బద్దకంతో, ఖాళీగా ఉంటూ, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇలా సగం జీవితం పాడుచేసుకుంటాం. కానీ రవితేజ గారు మాత్రం రెండు వందల ఏళ్లు బతుకుతారు. ఎందుకంటే ఆయన ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఇకపోతే పాయల్ రాజ్‌పుత్ గురించి చెప్పుకోవాలి. సాధారణంగా ఆర్టిస్ట్‌కి డైలాగ్ చాలా ముఖ్యం. సాధారణంగా ఆర్టిస్ట్ అంటే కళ్లతో భావాలను పలికించాలని అంటుంటారు. కానీ అది చాలా తక్కువ మందికి తెలిసిన కళ. ఆ కళ పాయల్‌లో ఉంది’’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uzm7X1

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk