Sunday, 26 January 2020

sreekaram Movie First Look: ముగ్గురు స్టార్ హీరోల ఫస్ట్‌లుక్స్.. మీ ఓటు ఎవరికి?

2020లో టాలీవుడ్ మరింత బిజీ అయిపోయింది. ఈ ఏడాది చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈరోజు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్ ఒకేసారి విడుదల కావడం విశేషం. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరంటే.. శర్వానంద్, , సుధీర్ బాబు. వీరి ముగ్గురికీ సంబంధించిన లుక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. ‘శ్రీకారం’ చుట్టిన శర్వ యువ కథానాయకుడు శర్వానంద్ టాలీవుడ్‌కి చెందిన టాలెంటెడ్ హీరోల్లో ఒకరు. ఏడాదికి చేసేది ఒకటి, రెండు సినిమాలే అయినా మంచి కాన్సెప్ట్ ఉండేవే ఎంచుకుంటారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘జాను’, మరొకటి ‘శ్రీకారం’. ఈరోజు ‘శ్రీకారం’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. లుక్‌లో శర్వా లుంగీ కట్టుకుని, కండువా వేసుకుని పొలంలో నడుస్తున్నట్లు కనిపించారు. చూడబోతే ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తోంది. ఇందులో ‘గ్యాంగ్ లీడర్’ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించనున్నారు. కిశోర్ సినిమాకును డైరెక్ట్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సినిమాకు సంగీతం అందించనున్నారు. READ ALSO: గోపీచంద్ ‘సీటీమార్’ ఈమధ్యకాలంలో మాస్ హీరో గోపీచంద్‌కు సరైన హిట్లు లేవు. 2017 నుంచి 2019 వరకు ఆయన నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులకు రుచించలేదు. ఈసారైనా గట్టిగా కొట్టాలన్న సంకల్పంతో ఉన్నారు. ఆయన నటిస్తున్న సినిమా ‘సీటీమార్’. ‘గౌతమ్ నంద’ సినిమాతో తనకు ఫ్లాప్ ఇచ్చిన సంపత్ నందికే మరో అవకాశం ఇచ్చారు గోపీచంద్. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించనున్నారు. భూమిక కీలక పాత్ర పోషించనున్నారు. ‘హిప్పీ’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన దిగంగన సూర్యవంశీ మరో కథానాయికగా నటించనున్నారు. ఫస్ట్‌లుక్‌లో మీసం కట్టుతో గోపీచంద్ మాస్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతోనైనా గోపీచంద్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తారో లేదో చూడాలి. రక్షకుడిగా వస్తున్న సుధీర్ బాబు సూపర్‌స్టార్ మహేష్ బాబు అంత కాకపోయినా.. తన స్టైల్‌లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న నటుడు సుధీర్ బాబు. కెరీర్ తొలినాళ్లలో మంచి సినిమాల్లోనే నటించి మెప్పించారు. కానీ ఆయన చివరగా నటించిన ‘వీర భోగ వసంత రాయులు’ సినిమా మాత్రం భయంకరమైన ఫ్లాప్‌నిచ్చింది. మళ్లీ అలాంటి రిస్క్స్ చేయకూడదని సుధీర్ నిర్ణయించేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘’ అనే సినిమాలో నటిస్తున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టా్ర్ నాని ఇందులో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ‘తప్పు జరిగితే యముడు వస్తాడనేది నమ్మకం .... వీడొస్తాడనేది మాత్రం నిజం’ అని సుధీర్ బాబు తన పాత్ర ఎలా ఉండబోతోందో ఓ చిన్న హింట్ ఇచ్చారు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RuuIDC

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....