Sunday, 26 January 2020

Naga Shaurya: హీరోయిన్లపై శౌర్య కామెంట్స్... మెగా వారసురాల్ని మాత్రం..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకున్న టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతున్నాడు యువ హీరో నాగశౌర్య. సొంత బ్యానర్‌పై సినిమాలు తీస్తూ ప్రేక్షకుల ముందుకు మంచి కాన్సెప్ట్స్‌తో వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘అశ్వద్థామ’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రాపిడ్ ఫైర్‌లో భాగంగా హీరో, హీరోయిన్లపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అయితే నిహారిక గురించి అడిగితే మాత్రం ఏమీ స్పందించలేదు నాగశౌర్య. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో నాగశౌర్యకు ఎదురైన ప్రశ్నలేంటంటే... మీ గురించి మీరు విన్న క్రేజీ రూమర్ ఏంటి? నాకు పెళ్లైపోయిందని... ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? అనుష్క ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునేవారు? ఆటోమొబైల్స్ మీరు చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు? పొడవాటి జుట్టు ఉండాలి. మనిషి ఎత్తుగా ఉండాలి. మా అమ్మ తర్వాత నన్ను అమ్మలా చూసుకోవాలి. ఇండస్ట్రీలో స్పెషల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నారా రోహిత్. READ ALSO: ఎలాంటి పాత్రలో నటించాలని ఉంది? ‘జోకర్’ సినిమాలో హీరో పోషించే పాత్రలో నటించాలని ఉంది. ఎప్పుడైనా ఎవర్నైనా చీట్ చేశారా? నేను చేయలేదు. కానీ నన్ను చీట్ చేశారు. నేను బాధపెట్టానంతే. మీరు నటించిన సినిమాల్లో బెస్ట్ సినిమా ఏది? అశ్వధ్థామ మీరు చేసిన సినిమాల్లో ఇందులో ఎందుకు నటించాను రా బాబూ అని ఎప్పుడైనా అనుకున్నారా? అబ్బాయితో అమ్మాయి సినిమాలో నటిస్తున్నప్పుడు అలా అనుకున్నా. మీరు నటించిన హీరోయిన్లలో నచ్చే క్వాలిటీ, నచ్చని క్వాలిటీ చెప్పండి? రెజీనా: యాక్టింగ్ చాలా బాగా చేస్తది. నచ్చని క్వాలిటీ రోజూ సెట్‌కు ఆలస్యంగా వస్తుంది. సాయి పల్లవి: అడిగేశారా... సరే సమాధానం చెప్పాలిగా. నచ్చే క్వాలిటీ డ్యాన్స్ బాగా చేస్తుంది. నచ్చని క్వాలిటీ సెట్స్‌కు లేటుగా వస్తుంది. సమంత: డెడికేషన్ నచ్చుతుంది. నచ్చని విషయం అస్సలు రెస్ట్ తీసుకోదు. నిహారిక: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చానన్న పొగరు అస్సలు ఉండదు. అణుకువగా ఉంటుంది. (ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. నచ్చని విషయం చెప్పడానికి బాగా టైం తీసుకున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందేనా అంటూ ఏమీ చెప్పలేకపోయాడు) READ ALSO: ఇండస్ట్రీలో స్టైలిష్ హీరో, హ్యాండ్సమ్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ, ప్రభాస్ బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే టేక్‌లో షాట్ చేసేసే హీరో ఎవరు? ఎన్టీఆర్ ఇష్టమైన సినిమా? నిన్నే పెళ్లాడతా READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vpvxVy

No comments:

Post a Comment

'Listing Does Not Alter Our Investment Philosophy'

'We operate in an economy that is structurally positioned for long-term growth. As market levels rise over time, our AUM grows in line....