
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు దాదాపు ఐదేళ్ల క్రితం తగిలిన గాయం ఇంకా మానలేదట. 2014లో మహేష్ ‘ఆగడు’ సినిమాలో నటిస్తున్నప్పుడు మోకాలికి గాయమైందట. అయితే అప్పట్లో ఆయన దాని గురించి అంతగా పట్టించుకోలేదు కానీ ఆ నొప్పి ఇప్పటికీ తగ్గలేదట. దాంతో మహేష్ వైద్యులను సంప్రదించారు. మోకాలికి చిన్నపాటి శస్త్ర చికిత్స చేస్తే మంచిదని వైద్యులు సూచించారట. దాంతో మహేష్ ఫ్యామిలీతో అమెరికా వెళ్లనున్నారు. మూడు నెలల పాటు అక్కడే రెస్ట్ తీసుకోనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. చికిత్స నుంచి కోలుకున్నాక మహేష్.. వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. బహుశా మే నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో మహేష్ స్పై పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఏ.ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘స్పైడర్’ సినిమాలోనూ మహేష్ స్పై పాత్రలో నటించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. READ ALSO: మహేష్‌కు ‘మహర్షి’తో మంచి హిట్ ఇచ్చిన వంశీ ఈసారి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూడాలి. ఇందులో కియారా అడ్వాణీని కథానాయికగా ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. తమన్ సంగీతం అందిస్తారు. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సంక్రాంతికి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్.. బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అధికారి పాత్రలో నటించారు. రష్మిక మందన కథానాయికగా నటించారు. లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రను పోషించారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Gohpy8
No comments:
Post a Comment