Friday, 24 January 2020

నితిన్ డెస్టినేషన్ మ్యారేజ్.. కుటుంబసభ్యులే అతిథులు

టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో హీరో నితిన్ ఒకరు. నితిన్ కార్యక్రమానికి వెళ్లినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అనే కామన్ క్వశ్చన్ ఆయన ముందు ఉంటుంది. అయితే, ఎట్టకేలకు నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఒక సంబంధాన్ని ఓకే చేసినట్టు తెలిసింది. శాలిని అనే అమ్మాయిని నితిన్ పెళ్లాడబోతున్నారట. ఇది ప్రేమ వివాహం అని సమాచారం. యూకేలో ఎంబీఏ చేసిన శాలినిని నితిన్ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నారట. వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేసి పెళ్లికి ఒప్పించారని టాక్. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగబోతోందని తెలిసింది. ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించారని టాక్. పెళ్లి పనులన్నీ నితిన్ సోదరి నిఖిత దగ్గరుండి చూసుకుంటున్నారట. అయితే, నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తాజా సమాచారం. దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో వైభవంగా వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన 50 నుంచి 60 మంది అతిథులు మాత్రమే హాజరవుతారట. అనంతరం హైదరాబాద్‌లో సన్నిహితులు, సినీ ప్రముఖులకు గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఇస్తారట. Also Read: నిర్మాత సుధాకర్ రెడ్డి కుమారుడైన నితిన్ ‘జయం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తయ్యింది. ప్రస్తుతం నితిన్ వయసు 36 ఏళ్లు. కాగా, నితిన్‌ ప్రస్తుతం ‘భీష్మ’ సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aIzJ2I

No comments:

Post a Comment

'If You Play A Goon Once...'

'I felt I didn't understand the film industry at all.' from rediff Top Interviews https://ift.tt/tIPceXf