
‘మన్మథుడు’ పక్కన ఒక్కసారైనా నటించాలని ఎదురుచూస్తున్న నాయికలు చాలా మంది ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాకు మాత్రం హీరోయిన్‌ను దొరకడంలో కాస్త ఆలస్యం అయింది. ఎందుకో ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలకు హీరోయిన్ కష్టాలు తప్పడంలేదు. సీనియర్ హీరోల్లో ఇప్పటికే గ్లామరస్‌గా మన్మథుడు ఇమేజ్‌తో కనిపిస్తున్న నటుడు నాగార్జున. ఇప్పటికీ రొమాంటిక్ రోల్స్ చేస్తున్న నాగ్ తాజాగా మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాకు సంతకం చేసేశారు. ఈపాటికి షూటింగ్ కూడా మొదలైపోయి ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేసేశారు. అయితే ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు అన్న విషయం చాలా కాలంగా సస్పెన్స్‌గా ఉంది. తెలుగు హీరోయిన్లు ఇతర కమిట్మెంట్స్‌తో బిజీగా ఉన్నారో ఏమో. నాగ్ కోసం టీం బాలీవుడ్ భామను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు దియా మీర్జా. హైదరాబాదీ అయిన దియా మీర్జా ముంబయిలో సెటిల్ అయ్యారు. బాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల దియా తన భర్తకు విడాకులు ఇచ్చేసి సినిమాలపై ఫోకస్ పెట్టారు. READ ALSO: ఏదన్నా మంచి ఆఫర్ వస్తే ఓకే చేద్దామని అనుకుంటున్న సమయంలో దియాకు నాగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఆయనతో సినిమా అంటే ఎవరు కాదంటారు చెప్పండి. అందుకే వెంటనే సినిమాకు ఓకే చేసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సోలోమాన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38yOYcM
No comments:
Post a Comment