Thursday, 23 January 2020

30 years Prudhvi: పవన్‌పై కామెంట్స్.. ‘అల..’ ఛాన్స్ పోయిందట

ఈ మధ్యకాలంలో థర్టీ ఇయర్స్ పృథ్వీకి ఏదీ కలిసి రావడంలేదు. ఎంతో కష్టపడి సినీ పరిశ్రమలో బెస్ట్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ అయ్యే అవకాశం దక్కించుకున్న ఆయన్ను.. ఓ చిన్న ఫోన్ కాల్‌ దిగజారిపోయేలా చేసింది. ఎస్వీబీసీ ఛానెల్‌లో పనిచేసే ఓ మహిళతో పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడటం, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. దాంతో ఆయన పదవికి రాజీనామా చేసేశారు. అయితే పృథ్వీ గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో పృథ్వీకి ఓ మంచి పాత్ర రావాల్సి ఉందట. కానీ అప్పటికే ఆయన సినీ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌‌పై, జనసేన పార్టీపై నోటికొచ్చిన కామెంట్స్ చేయడంతో ఆ పాత్ర ప్రముఖ నటుడు హర్షవర్ధన్‌కు దక్కింది. ఈ పాత్ర వల్ల హర్షవర్ధన్‌కు మంచి పేరు వచ్చింది. నెగిటివ్ షేడ్స్‌, కామెడీ యాంగిల్ ఉన్న ఈ క్యారెక్టర్‌ పృథ్వీకి దక్కి ఉంటే పరకాయ ప్రవేశం చేసేవారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం దక్కలేదు. READ ALSO: కానీ హర్షవర్ధన్ మాత్రం ఈ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ప్రస్తుతం పృథ్వీ మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడటంలేదు. తనపై ఉన్న అభియోగాలు తప్పు అని తేలాకే మళ్లీ మీడియా ముందుకు వస్తానని తెలిపారు. తనపై కావాలని ప్రతిపక్ష పార్టీలు కుట్రపన్నాయని, భార్య, పిల్లలు ఉన్న తనకు వేరొకరితో అక్రమ సంబంధం అంటగట్టారని ఆయన బాధపడ్డారు. ఏదేమైనా పృథ్వీ అటు సినిమాలు లేక, ఇటు పదవులూ లేక సతమతమవుతున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RmJBHR

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...