
బాహుబలి తరువాత జాతీయ స్థాయిలో సత్తా చాటిన మరో సౌత్ సినిమా . కన్నడ ఇండస్ట్రీ టెక్నికల్‌గా అంత ఉన్నత స్థాయిలో ఉండదన్న అపవాదును చెరిపేస్తే దేశం గర్వించదగ్గ ఓ భారీ చిత్రాన్ని రూపొందించిచూపించారు సాండల్‌వుడ్ మేకర్స్. ఈ సినిమాతో హీరో , డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌లకు ఒక్కసారిగా నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఏర్పడింది. 2018లో రిలీజ్ కేజీఎఫ్.. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండటం విశేషం. Also Read: ఈ భారీ సీక్వెల్‌ను 2020 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ చాలా కాలం కిందటే ఎనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్‌ను కూడా ప్లాన్ చేశారు. కానీ భారీ చిత్రం కావటంతో భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతుండంతో షూటింగ్ అనుకున్న ప్రకారం ముందుకు సాగటంలేదు. దీనికి తోడు సినిమా మీద భారీ అంచనాలే ఏర్పడటంతో ఆ స్థాయిలో సినిమాను రూపొందించేందుకు చిత్రయూనిట్ చాలా సమయం తీసుకుంటున్నారు. దీంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. అంతేకాదు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు చిత్రయూనిట్. Also Read: అందుకే ముందుగా అనుకున్నట్టుగా సమ్మర్‌లో కాకుండా సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలా అయితే షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాల విషయంలో కూడా ఎలాంటి హడావిడి లేకుండా పర్ఫెక్ట్‌గా సినిమాను ప్లాన్ చేయోచ్చని భావిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా కేజీఎఫ్ 2 వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uxzDdA
No comments:
Post a Comment