Saturday, 25 January 2020

Sunil: ఆరోజు సునీల్ చేసిన పనిని ఇప్పటికీ మర్చిపోలేను: హీరో ఆకాశ్ షాకింగ్ వ్యాఖ్యలు

ఒకప్పుడు ‘ఆనందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సినీ నటుడు . ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాల్లో నటించారు కానీ కొందరు రాజకీయాలకు పాల్పడి తనను తొక్కేశారంటూ బాధపడుతున్నారు. కమెడియన్ సునీల్ కూడా తనను వాడుకున్నారని వాపోయారు. ‘‘ఆనందం సినిమా తర్వాత నాకు తెలుగులో విపరీతమైన స్టార్‌డం వచ్చేసింది. అప్పట్లోనే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయలు రాబట్టిందంటే.. ఇప్పుడు చూసుకుంటే రూ.100 కోట్లు వచ్చినట్లే. ఆ తర్వాత నాలుగైదు మంచి కథలున్న సినిమాలు చేశాను. కానీ అవేవీ విడుదల కాలేదు. నేను మంచి మనసుతో నా వల్ల నిర్మాతలకు డబ్బు వస్తుందని సినిమాలు చేస్తే.. వాళ్లు మాత్రం విడుదల చేయలేదు. దాని వెనక ఎవరో ఉన్నారనే నేను అనుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటుంది. ఒక హీరో ఎదగాలంటే మరో హీరోను అణగదొక్కాలి. నాకు ఆనందం తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది కానీ అందరూ సెకండ్ హీరో క్యారెక్టర్స్ ఇచ్చేవారు. నాకేమో హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది’’ ‘‘ ‘అందాలరాముడు’ సినిమాలో సునీల్ హీరోగా నటిస్తున్నప్పుడు నన్ను కలిశాడు. సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉంది అన్నారు. నేను గెస్ట్ రోలే కదా అని ఒప్పుకున్నాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కానీ సక్సెస్ మీట్‌‌లో మాత్రం సునీల్ నా పేరు ఎక్కడా చెప్పలేదు. సినిమా విజయం కావడానికి ఆకాశ్ కూడా కారణమని చెప్పలేదు. చెప్పాలంటే ‘ఆనందం’ సినిమా తర్వాత నేను ఏమీ సంపాదించలేదు. వట్టి చేతులతో తమిళ చిత్ర పరిశ్రమకు వెళ్లాను. అక్కడ నేను తీసిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి. కన్నడలోనూ బిజీ అయిపోయాను. ఇప్పుడు తెలుగులో అవకాశాలు వచ్చినా చేస్తాను. కానీ నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తాను’’ READ ALSO: ‘‘ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ విషయానికొస్తే.. నేను ఆ సినిమా టీజర్, ట్రైలర్ చూసుంటే కచ్చితంగా కోర్టులో కేసు వేసేవాడిని. కానీ నేను చూడలేదు. సినిమా విడుదల అవుతుందనగా కొన్ని రోజుల ముందు ఆ సినిమా గురించి నాకు తెలిసింది. అది నేను రాసుకున్న కథ. సినిమా షూటింగ్ కూడా అయిపోయింది. చెప్పాలంటే ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ముందే నా సినిమా ట్రైలర్ వచ్చేసింది. అందుకే నేను ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ సర్‌తో మాట్లాడాను. నేను తలుచుకుని ఉంటే సినిమా విడుదలైన రోజు కూడా కోర్టులో కేసు వేయచ్చు. అప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇన్ని కలెక్షన్లు వచ్చి ఉండేవి కావు. పూరీ సర్‌పై గౌరవంతో నేను మౌనం వహించాను. ఒకప్పుడు నాకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నవారంతా ఇప్పుడు కనీసం పలకరించడంలేదు’’ READ ALSO: ‘‘నాతో కాస్త మాట్లాడుతున్నవారు ఎవరైనా ఉన్నారంటే అది రవితేజ గారే. ఆయన నటించిన తొలి సినిమా ‘చిరంజీవులు’లో నేను రెండో హీరోగా నటించా. అలా మా మధ్య స్నేహం పెరిగింది. సినిమా ఇండస్ట్రీలో జరిగిన రాజకీయాల వల్ల నేను పైకి రాలేకపోయాను. కానీ ఇప్పుడు కాలం మారింది. 18 ఏళ్ల తర్వాత నాకు మళ్ల నిరూపించుకునే అవకాశం వచ్చింది. వెబ్ సిరీస్‌లు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి నా బ్యానర్‌పై నేనే మంచి కథ రాసుకుని సినిమా తీస్తాను. వాటిని ఓటీటీ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ చేసేస్తాను’’ అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30ZSYR6

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8