Thursday, 23 January 2020

పెళ్లైన విషయం దాచి మోసం చేశాడు: పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

భర్త వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ తమిళ నటి. శివకార్తికేయన్ నటించిన ‘మాన్ కారటే’ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆమె.. ఏడాది క్రితం రెండో పెళ్లి చేసుకుంది. ఇదివరకే ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్తతో విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఓ జిమ్ సెంటర్‌ను పెట్టుకుని తన పిల్లలను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు శరవణన్ అనే 40 ఏళ్ల వ్యక్తి పరిచయమయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన వారం రోజులు అనుమానం రాకుండా బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత లేనిపోని నిందలు వేసి ఆమె సంపాదించిన డబ్బు కాజేయాలని చూశాడు. ఈ నేపథ్యంలో శరవణన్‌కి ఇదివరకే పెళ్లైందన్న నిజం నటికి తెలిసింది. అంతేకాదు తన మొదటి భార్యతో కలిసి ప్లాన్ వేసి నటిని పెళ్లి చేసుకున్నాడట. ఇదంతా ఆమె ఆస్తి కోసం చేశాడట. ఈ విషయాన్ని సదరు నటి పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. తన పిల్లలను కూడా టార్చర్ పెడుతున్నట్లు తెలిపింది. READ ALSO: అంతేకాదు ఇంటికి ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి వారిని ఎంటర్‌టైన్ చేయాలని అంటున్నాడట. దాంతో అతన్ని వదిలించుకుని పిల్లల్ని తీసుకుని వేరే కాపురం పెట్టింది. ఈ విషయం తెలిసి శరవణన్ నటిని కిడ్నాప్ చేయించాలని కుట్రపన్నాడు. దాంతో ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని తమిళనాడులోని తిరుమంగళం ప్రాంతంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఈ కేసును పరిశీలిస్తున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36nl3m8

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...