Wednesday, 2 October 2019

‘సైరా’కు టాలీవుడ్ ప్రశంసలు.. క్రిష్ బిగ్ సెల్యూట్

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘సైరా’ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి జీవించేశారంటూ కొనియాడారు. ఒక్క రాజమౌళినే కాదు దర్శకులు క్రిష్, వెంకీ అట్లూరి, నిర్మాత శోభు యార్లగడ్డ, హీరో మంచు మనోజ్ ‘సైరా’ను పొగుడుతూ ట్వీట్లు చేశారు. ‘‘గొప్ప పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కనుమరుగైన చరిత్రను సైరా సినిమాగా తీసుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి బిగ్ సెల్యూట్. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డికి హ్యాట్సాఫ్. గర్వించదగిన తనయుడు, నిర్మాత చరణ్ చాలా గొప్పగా నిర్మించారు’’ అని క్రిష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి.. ‘‘నిజంగా చిరంజీవి గారి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను వర్ణించడానికి పదాలు సరిపోవు. సినిమా చాలా బాగుంది. ఇంత గొప్ప క్లాసిక్ చిత్రాన్ని అందించిన మెగాస్టార్, చరణ్, సురేందర్ రెడ్డిని అభినందించకుండా ఉండలేం’’ అని ట్వీట్ చేశారు. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ అయితే ‘సైరా’ మ్యానియాలో మునిగి తేలుతున్నారు. చిరంజీవి గారి అభిమానిని అయినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని ట్వీట్ చేశారు. ‘‘సైరా నరసింహారెడ్డిలో ప్రతి బిట్‌ చాలా నచ్చింది. అసలు ఆ ఎమోషనల్, పాట్రాయిటిక్ రైడ్ అద్భుతం. అందరు నటీనటులు, టెక్నీషియన్లు చాలా గొప్పగా చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డికి వందనాలు. చరణ్ అన్నకు ప్రేమతో ముద్దులు’’ అని వరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేస్తూ.. ‘‘సైరా చాలా నచ్చింది. చిరంజీవి గారు అద్భుతం. సురేందర్ రెడ్డి స్టన్నింగ్ యాక్షన్, డ్రామాతో కూడిన బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్ అయితే ఔట్‌స్టాండింగ్. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్, గ్రాండియర్ కనిపించింది. తమన్నా చాలా బాగా చేసింది. అంతే అందంగా కూడా ఉంది. రామ్ చరణ్, అతని టీంకి అభినందనలు’’ అని పేర్కొన్నారు. హీరో మంచు మనోజ్ కూడా ‘సైరా’ టీంకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్‌, దర్శకుడు సురేందర్, మిగిలిన ‘సైరా’ టీం మొత్తానికి అభినందనలు. మనకు తెలియని ఒక స్వాతంత్య్ర యోధుడి పాత్రలో మనకు బాగా తెలిసిన చిరంజీవిగారిని చూడటం కనులపండువే. మీ దగ్గరలోని థియేటర్లలో ఇప్పుడే చూడండి’’ అని మనోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mTbAT2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....