Tuesday 29 October 2019

‘Mega Family’పై వర్మ షాకింగ్ ట్విస్ట్

వివాదాల దర్శకుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి బాంబ్ పెడతాడో ఆయనకే తెలీదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ తెలుగు రాష్ట్రల్లో దుమ్మురేపింది. చంద్రబాబు నాయుడు, జగన్, లోకేష్ పాత్రధారులను పరిచయం చేస్తూ విడుదల చేసిన ట్రైలర్ విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ సినిమాతోనే జనాలు తట్టుకోలేకపోతుంటే నిన్న మరో సినిమాను ప్రకటించారు వర్మ. ‘మెగా ఫ్యామిలీ’ అనే టైటిల్‌ను ప్రకటించి ఇదే తన తర్వాతి సినిమా అన్నారు. దాంతో వర్మ.. చిరంజీవి ఫ్యామిలీని టచ్ చేస్తున్నాడని అనుకున్నారు చాలా మంది. ఈ సినిమా ఏమై ఉంటుంది అని ఆలోచించేలోపే తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు వర్మ. తాను ‘మెగా ఫ్యామిలీ’ సినిమా చేయడంలేదని ప్రకటించారు. ఇందుకు కారణం ఏంటో తెలిస్తే పగలబడి నవ్వుకుంటారు. ‘మెగా ఫ్యామిలీ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ఓ వ్యక్తికి 39 మంది సంతానం ఉంటారు. చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి, నేను చిన్న పిల్లలపై సినిమాలు చేయను కాబట్టి, ఈ సినిమాను చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్ చేశారు. కావాలనే చిరంజీవి కుటుంబ నేపథ్యంలో సినిమా చేస్తున్నానని ప్రజల్లో ఆసక్తి రేకెత్తించడానికే వర్మ ఈ సినిమా తీస్తున్నారని జోక్ చేశారు. అందరూ చిరంజీవి గురించే అనుకుంటారని, దాంతో తాను తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ప్రమోషన్స్‌కు మరింత మైలేజ్ వస్తుందని వర్మ ఆలోచించాడు. కావాలని మెగా ఫ్యామిలీ పిల్లల సినిమా అని చెప్పి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వర్మ తీసే సినిమాల్లో వివాదం ఉన్నప్పటికీ ఆయనలో ఎలాంటి బెరుకు కనిపించదు. నేను కేవలం నా సినిమాలతో నిజాలను మాత్రమే చూపిస్తాను అని చెప్తుంటారు. మరి ఇప్పుడు కడపరెడ్లు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆడుతుందో లేదో చూడాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడదల సమయంలో అధికారంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఏపీలో సినిమా విడుదలను అడ్డుకున్నారు. అప్పుడు జగన్ వర్మకు, ఈ సినిమాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు అధికారంలోకి జగన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వర్మ సినిమా సాఫీగా విడుదల అవుతుందో లేదో వేచి చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ptg0w2

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...